శ్రీకృష్ణ తులాభారం చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీకృష్ణ తులాభారం (1966)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : దాశరధి
గానం : జానకి, సుశీల
కరుణించవే తులసిమాత
కరుణించవే తులసిమాత
దీవించవే దేవీ మనసారా
కరుణించవే తులసిమాత
నిన్నే కోరి పూజించిన సతికీ
కలుగుకాదే సౌభాగ్యములన్ని
నిన్నే కోరి పూజించిన సతికీ
కలుగుకాదే సౌభాగ్యములూ
కరుణించవే తులసిమాత
కరుణించవే తులసిమాత
దీవించవే దేవీ మనసారా
కరుణించవే....దీవించవే..
పాలించవే..తులసిమాత
వేలుపురాణి వాడని వయసు
వైభవమంతా నీ మహిమేగా
ఆ......ఆ....ఆ...ఆ....ఆ...ఆ
ఆ......ఆ....ఆ...ఆ....ఆ...ఆ
వేలుపురాణి వాడని వయసు
వైభవమంతా నీ మహిమేగా
అతివలలోనా అతిశయమందే
భోగమందీయ్యవే
కరుణించవే కల్పవల్లీ
కరుణించవే కల్పవల్లీ
దీవించవే తల్లీ.. మనసారా
కరుణించవే దీవించవే
పాలించవే కల్పవల్లీ
నిదురనైనా నా నాధుని సేవా
చెదరనీక కాపాడగదే
ఆ...ఆ...ఆ...ఆ.ఆ.ఆ.ఆ
ఆ...ఆ...ఆ...ఆ.ఆ.ఆ.ఆ
నిదురనైనా నా నాధుని సేవా
చెదరనీక కాపాడగదే
కలలనైనా గోపాలుడు నన్నే
వలచురీతి దీవించగదే
కలలనైనా గోపాలుడు నన్నే
వలచురీతి దీవించగదే
కరుణించవే కల్పవల్లీ
కరుణించవే తూలసిమాత
దీవించవే తల్లీ మనసారా
కరుణించవే... దీవించవే
పాలించవే... తులసిమాత
4 comments:
Golden voices of susheela amma and janaki amma
థాంక్స్ ఫర్ ద కామెంట్ బుచికి గారు..
ఆ రోజుల్లో చాలా మటుకూ మూవీస్ లో తులసి కోట దగ్గిర ఓ చక్కని పాట ఉండేది కదా..
హ్మ్.. అవునండీ.. ఇప్పుడు తులసికోటలే కనిపించడం మానేశాయి.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.