మిత్రులందరకూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందచేస్తూ అల్లుడొచ్చాడు చిత్రంనుండి ఈ చక్కని గీతాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అల్లుడొచ్చాడు (1976)
సంగీతం : శంకరంబాడి సుందరాచారి
సాహిత్యం : శంకరంబాడి సుందరాచారి
గానం : సుశీల
మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ
మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ
కడుపులో బంగారు కను చూపులో కరుణా
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
మా తెలుగు తల్లికి మల్లె పూదండా
గల గలా గోదారి కదలి పోతుంటేను ॥గల గలా॥
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి
మా తెలుగు తల్లికి మల్లె పూదండా
అమరావతీ గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ పాటలే పాడుతాం
నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!!
4 comments:
మీకూ బిలేటెడ్ విషెస్ వేణూజీ..
థాంక్స్ శాంతి గారు మీక్కూడా..
మీరు పంపిన రెండు లింకులలోనూ ఈ పాట వినలేకపోయాము.
సారీ భవానీ ప్రసాద్ గారు.. ఆల్బమ్ లింక్స్ ఇచ్చేశాను ఈ పాట లేదనే విషయం గమనించుకోలేదు. ఇపుడు సరిచేసాను చూడండి. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.