శనివారం, ఆగస్టు 03, 2019

ఆనందమాయే...

చెంచులక్ష్మి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చెంచులక్ష్మి (1958)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, జిక్కి

ఆఆఆఅ...
ఆనందమాయే అలినీలవేణీ
ఆనందమాయే అలినీలవేణీ
అరుదెంచినావా అందాల దేవీ..
ఆనందమాయే అలినీలవేణీ
అరుదెంచినావా అందాల దేవీ..

ఓఓఓఓఓఓఓఓఓఓఓ
అనువైన వేళ అనురాగ శోభ
హరి ప్రేమ పూజా నా భాగ్యమాయే
అలనాటి నోము కల నేడు పండే
అరుదైన హాయి నాలోన నిండే

ఆనందమాయే అసమాన తేజ
అపురూపమైనా అందాల దేవా
ఆనందమాయే అసమాన తేజ

ఆఆ... సొగసైన రూపే సోలించు చూపే
సగమైన కనుల సంతోష నిధులే
నగుమోము పైన నడయాడు కళలే
అగుపించగానే మగువరో నాలో

ఆనందమాయే అలినీలవేణీ
అరుదెంచినావా అందాల దేవీ..
ఆనందమాయే అలినీలవేణీ

ఓఓఓఓ...
ఎనలేని స్వామీ నిను చేరబోతే
నును లేత ప్రేమా నను సాగనీదే
తనువేమో నీకై తపియించు నిలచీ
మనసేమో నీలో మునుపే కలిసే

ఆనందమాయే అసమాన తేజ
అపురూపమైనా అందాల దేవా
ఆనందమాయే అలినీలవేణీ
అరుదెంచినావా అందాల దేవీ..
ఆనందమాయే అలినీలవేణీ... 
 

2 comments:

శ్రీమహావిష్ణువుగా యే.యన్.ఆర్ చాలా అందంగా అనిపించిన చిత్రం..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.