అన్నమయ్య చిత్రంలో కీర్తనలతో కూర్చిన ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అన్నమయ్య
గానం : బాలు, రేణుక, శ్రీలేఖ, పార్ధసారధి
విన్నపాలు వినవలె వింతవింతలూ
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ...
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ ...
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గువడియె పెండ్లి కూతురూ... ఊ ఊ...
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
2 comments:
చాలా మంచి కీర్తన..
అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.