బుధవారం, ఆగస్టు 14, 2019

ఎవరో.. అతడెవరో..

శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల

ఆ... ఆ... ఆ..
ఆ... ఆ... ఆ.. ఆ..
ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో...
నా మానసచోరుడెవరో.. ఎవరో.. అతడెవరో..

తొలిచూపులలో వలపులు చిలికి.. దోచిన మగసిరి దొర ఎవరో..
తొలిచూపులలో వలపులు చిలికి.. దోచిన మగసిరి దొర ఎవరో..
అరయగ హృదయము అర్పించితినే.. ఆదరించునో.. ఆదమరచునో

ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో...

వలరాజా? కలువలరాజా? కాడే.. కనులకు కనులకడుపడినాడే..
అకళంకుడే.. హరినాంగుడు కాడే..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
అకళంకుడే.. హరినాంగుడు కాడే.. మరి ఎవరో.. ఏమయినాడో...

ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో...

ఎవరో.. తానెవరో... ఆ నవమోహిని.. ఎవరో..
నా మానసహారిణి.. ఎవరో..
ఎవరో.. తానెవరో... ఆ నవమోహిని.. ఎవరో..

నందనవనమానందములో.. తొలిసారిగ పూచిన పువ్వో..
నందనవనమానందములో.. తొలిసారిగ పూచిన పువ్వో..

తొలకరి యవ్వనం ఒలికిన నవ్వో...
తొలకరి యవ్వనం ఒలికిన నవ్వో...
మనసిచ్చినదో.. నను మెచ్చినదో..
ఆ... జవ్వని..

ఎవరో.. తానెవరో... ఆ నవమోహిని.. ఎవరో..
నా మానసహారిణి.. ఎవరో.. ఎవరో.. తానెవరో... 


2 comments:

చాలా అందమైన పాట..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.