సంతోష్ నారాయణ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సంతోష్ నారాయణ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, ఆగస్టు 03, 2018

చిట్టెమ్మా చిట్టెమ్మా...

కాలా చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కాలా (2018)
సంగీతం : సంతోష్ నారాయణ్
సాహిత్యం : వనమాలి
గానం : అనంతు, శ్వేతామోహన్

పువ్వల్లే నా ప్రేమ తేనూరునో
ఆ నింగి తేనేల్లు కురింపించునో
చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళల్లో ఏంటమ్మా..

ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
ఏ గాయం ఎంతైన అది మానిపోదా
చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..

నా దేహమంతా నీ ప్రేమతావే
కాలాలు ఏమార్చెలే
ఎడమైన ప్రేమ తాకింది మంటై
దూరాలు పెరిగేనులే
నదిలాంటి ప్రేమే పయనాలు ఆపే
ఆ ఎండమావైనదే
కలలన్ని కరిగి చేజారగానే
కలతేమో బ్రతుకైనదే


చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..
ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
ఏ గాయమెంతైన అది మానిపోదా

ఏ తీగ వీణా పలికించకుండా
రాగాలు వినిపించదే
శిశిరాన వాడే చిగురాకులాగా
నా ప్రేమ మోడైనదే
ఏ జాలి లేని విధిరాత కూడా
చేసింది ఈ గాయమే
ముడి వేయకుండా
ముగిసింది నాడే
ఈ ప్రేమ అధ్యాయమే

చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..
ఆకాశమే లేక చిరుజల్లు ఉందా
ఏ గాయం ఎంతైన అది మానిపోదా
చిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళలో ఏంటమ్మా..  


శనివారం, మే 26, 2018

ఏయ్ డింగిరి..

ధర్మయోగి చిత్రంలోని ఒక సరదా ఐన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ధర్మ యోగి (2016)
సంగీతం : సంతోష్ నారాయణ్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : విజయ్ నారాయణ్

ఏయ్ డింగిరి.. తింగరి.. సుందరి..
ఐస్కాంతం చూపిసిరి ఎందుకే అల్లరి..
పడగొట్టావే మీసం నిమిరి
నిదరట్టనందే కూసం కదిలి
ఏయ్ పొగరేగే పొయిమీది జున్నా
నికరంగా నిన్నే తిననా 

పెట్టా కోడీ సొగసువే
బుట్టా కింది సరుకువే
చిట్టాకందని మెరుపులా వలవే
పట్టా కత్తీ పదునుగా
అట్టా ఎట్టా పుడితివే
మెట్టా వయసున చినుకుల దిగవే


ఏయ్ డింగిరి.. తింగరి.. సుందరి..
ఐస్కాంతం చూపిసిరి ఎందుకే అల్లరి..
జడపాయల్లో నన్నే తురిమి
సెగపెట్టినావే ఒంట్లో కొలిమి
నా ప్రాణాలే పంపావే పైకీ
వడిసెలా రాయై తాకీ

పెట్టా కోడీ సొగసువే
బుట్టా కింది సరుకువే
చిట్టాకందని మెరుపులా వలవే
పట్టా కత్తీ పదునుగా
అట్టా ఎట్టా పుడితివే
మెట్టా వయసున చినుకుల దిగవే
ఏయ్ డింగిరి..


ఓణీ అంచై అలా నీతో ఉండే కలా
విత్తనమల్లే పడి మొలిచిందే
మనసుని నిత్యం తెగ తొలిచిందే
వెన్నెల చలువకు పెదవిరిచిందే
నువ్విటు వస్తే ఆదమరిచిందే
కందిన గుండె మొక్కజొన్న కండె
రంగులు మారిందే
పడకలునిండే సరసము పండే
రాతిరి ఎపుడండే

పెట్టా కోడీ సొగసువే
బుట్టా కింది సరుకువే
చిట్టాకందని మెరుపులా వలవే
పట్టా కత్తీ పదునుగా
అట్టా ఎట్టా పుడితివే
మెట్టా వయసున చినుకుల దిగవే
ఏయ్ డింగిరి.. 


బుధవారం, ఏప్రిల్ 26, 2017

నిప్పురా...

కబాలి చిత్రం లోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కబాలి (2016)
సంగీతం : సంతోష్ నారాయణ్
సాహిత్యం : వనమాలి
గానం : అరుణ్ రాజ కామరాజ్

నిప్పురా...
తాకరా...
సాధ్యమా...

నిప్పురా తాకరా చూద్దాం
తాకితే మసే కదా మొత్తం
దురాత్ముల దురాగతం నిత్యం
పెరిగితే రగడం తద్యం
జగానికే తలొంచని తుఫాన్ని
జనానికై జన్మించిన నేస్తాన్ని
విధినే గెలవడ ఈశూళి
ఉషస్సులే పరిచెడు 
కబాలి.. కబాలి…

కరుణలు బలి కలతలిక వెలి
మనుసుడికిందా ఉక్కులాడిలు
అంతా నేడు మాయే మాయే
నీ శౌర్యం నిత్యం సమరమాయే
నీ రాజ్యంలోన రగిలే రోషం
ప్రతి మాటకు కొత్త పరమార్ధం

స్వేచ్ఛను ఇక నీ శ్వాసనుకో
భయమును విడు భ్రమనొదిలి నడువ్
ధైర్యం త్యాగం చేసే పోరు
నిను తాకిన గాయం మానే తీరు
ఇక ద్రోహం క్రోధం మాయం కావా
రాబోయే కాలం ఇతిహాసం గాధా
కబాలి కబాలి కబాలి కబాలి..



నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.