గురువారం, ఏప్రిల్ 22, 2021

కుకుకూ కుకుకూ...

శీనువాసంతిలక్ష్మి సినిమా లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శీనువాసంతి లక్ష్మి (2004)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్ 
సాహిత్యం : కులశేఖర్
గానం : ఆర్.పి.పట్నాయక్

కుకుకూ కుకుకూ కుకుకూకూ
తొలిరాగం నేర్పిందీ ఈ పలుకూ
కుకుకూ కుకుకూ కుకుకూకూ
నవలోకం చూపిందీ నీ పిలుపు 

చిగురాకుల సవ్వడి అయినా 
చిరుగాలి తాకినా
గుడిగంటల సందడి విన్నా
నాలో ఏదో మైమరపు

కుకుకూ కుకుకూ కుకుకూకూ
తొలిరాగం నేర్పిందీ ఈ పలుకూ

కుశలములెన్నో అడిగినదీ 
ఉరికే గోదావరీ
పులకలు నాలో చిలికినదీ 
ఎగసే ఈ లాహిరీ
కరిమబ్బునే మహ ముద్దుగా
ఎద ముందుకు తెచ్చేను గాలి 
తడి కన్నుల్లో సిరి వెన్నెలే
కురిపించెను జాబిలీ

కుకుకూ కుకుకూ కుకుకూకూ
తొలిరాగం నేర్పిందీ ఈ పలుకూ
కుకుకూ కుకుకూ కుకుకూకూ
నవలోకం చూపిందీ నీ పిలుపు 

అడుగులు తానై నడిపినదీ 
పుడమే ఓ దారినీ
పదములు పాడి పంచినదీ 
ఒడిలో ఓదార్పునీ
ఋణమన్నదే ఇక తీరదే 
నా ప్రాణములిచ్చిన గాని
నేల తల్లికే నేను ఇవ్వనా 
ఈ గీతాంజలీ

కుకుకూ కుకుకూ కుకుకూకూ
తొలిరాగం నేర్పిందీ ఈ పలుకూ
కుకుకూ కుకుకూ కుకుకూకూ
నవలోకం చూపిందీ నీ పిలుపు 

చిగురాకుల సవ్వడి అయినా 
చిరుగాలి తాకినా
గుడిగంటల సందడి విన్నా
నాలో ఏదో మైమరపు

కుకుకూ కుకుకూ కుకుకూకూ
తొలిరాగం నేర్పిందీ ఈ పలుకూ
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.