అమిత్ త్రివేది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమిత్ త్రివేది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, ఫిబ్రవరి 26, 2021

మనసు మరీ మత్తుగా...

వి చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : వి (2020)
సంగీతం : అమిత్ త్రివేది
సాహిత్యం : సిరివెన్నెల   
గానం : అమిత్ త్రివేది, షాషా తిరుపతి

మనసు మరీ మత్తుగా 
తూగిపోతున్నదే ఏమో ఈ వేళా
వయసు మరీ వింతగా 
విస్తుబోతున్నదే నీదే ఈ లీలా
అంతగా కవ్వింస్తావేం గిల్లి
అందుకే బందించేయ్ నన్నల్లి
కిలాడి కోమలీ… గులేబకావళీ
సుఖాల జావళీ.. వినాలి కౌగిలీ

మనసు మరీ మత్తుగా 
తూగిపోతున్నదే ఏమో ఈ వేళా
వయసు మరీ వింతగా 
విస్తుబోతున్నదే నీదే ఈ లీలా

ఓ అడుగులో అడుగువై 
ఇలా రా నాతో నిత్యం వరాననా
హ.. బతుకులో బతుకునై 
నివేదిస్తా నా సర్వం జహాపనా
పూలనావ.. గాలితోవ.. హైలో హైలెస్సో
ఓ.. చేరనీవా చేయనీవా.. సేవలేవేవో

ఓ… మనసు మరీ మత్తుగా 
తూగిపోతున్నదే ఏమో ఈ వేళా…
ఓ.. వయసు మరీ వింతగా 
విస్తుబోతున్నదే నీదే ఈ లీలా…

మనసులో అలలయే 
రహస్యాలేవో చెప్పే క్షణం ఇదీ..
మనువుతో మొదలయే 
మరో జన్మాన్నై పుట్టే వరమిదీ..
నీలో ఉంచా నాప్రాణాన్ని 
చూసి పోల్చుకో
ఓ.. నాలో పెంచా నీ కలలన్నీ.. 
ఊగనీ ఊయల్లో

మనసు మరీ మత్తుగా 
తూగిపోతున్నదే ఏమో ఈ వేళా
ఓ.. వయసు మరీ వింతగా 
విస్తుబోతున్నదే నీదే ఈ లీలా
అంతగా కవ్విస్తావేం గిల్లి..
అందుకే బందించేయ్ నన్నల్లి..
కిలాడి కోమలీ… గులేబకావళీ…
సుఖాల జావళీ.. వినాలి కౌగిలీ…
 

 

శుక్రవారం, జనవరి 31, 2020

ఓ సైరా...

సైరా నరసింహా రెడ్డి చిత్రంలోని ఒక స్ఫూర్తిదాయకమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం : అమిత్ త్రివేది  
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సునిధి చౌహాన్, శ్రేయా ఘోషల్ 

పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డఔర
ఉయ్యాలవాడ నారసింహుడా
చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీర
రెనాటి సీమ కన్న సూర్యుడా
మృత్యువే స్వయాన చిరాయురస్తు అనగా
ప్రసూతి గండమే జయించినావురా
నింగి శిరస్సు వంచి నమోస్తు నీకు అనగా
నవోదయానివై జనించినావురా

ఓ సైరా ఓ సైరా ఓ సైరా ఓ సైరా
ఉషస్సు నీకు ఊపిరాయరా
ఓ సైరా ఓ సైరా ఓ సైరా ఓ సైరా
యశస్సు నీకు రూపమాయరా

హో హో సైరా హోహో సైరా
హోహో సైరా హోహో సైరా

అహంకరించు ఆంగ్ల దొరలపైన
హూంకరించగలుగు ధైర్యమా
తలొంచి బ్రతుకు సాటివారి లోన
సాహసాన్ని నింపు శౌర్యమా
శృంకలాలనే తెంచుకొమ్మని
స్వేచ్చ కోసమే శ్వాసనిమ్మని
నినాదం నీవేరా

ఒక్కొక్క బిందువల్లె
జనులనొక్కచోట చేర్చి
సముద్రమల్లె మార్చినావురా
ప్రపంచమొణికిపోవు
ఫెను తూఫానులాగా వేచి
దొరల్ని దిక్కరించినావురా
మొట్ట మొదటిసారి స్వతంత్ర సమర భేరి
ఫెఠిల్లు మన్నది ప్రజాలి పోరిది
కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని
దహించు జ్వాలలో ప్రకాశమే ఇది

హో హో సైరా హోహో సైరా
హోహో సైరా హోహో సైరా

ఓ సైరా ఓ సైరా ఓ సైరా ఓ సైరా
ఉషస్సు నీకు ఊపిరాయరా
ఓ సైరా ఓ సైరా ఓ సైరా ఓ సైరా
యశస్సు నీకు రూపమాయరా

దాస్యాన జీవించడం కన్న
చావెంతో మేలంది నీ పౌరుషం
మనుషులైతే మనం అణిచివేసే
జులుం ఒప్పుకోకంది నీ ఉద్యమం

ఆలనీ బిడ్డనీ అమ్మనీ జన్మనీ
బందనాలన్నీ వదిలి సాగుదాం
ఓ.. నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై
అటే వేయనీ ప్రతి పథం

కదనరంగమంతా
కదనరంగమంతా
కొదమసింగమల్లే
కొదమసింగమల్లే
ఆక్రమించి ఆక్రమించి
విక్రమించి విక్రమించి
తరుముతోందిరా
అరివీర సంహారా

ఓ సైరా ఓ సైరా ఓ సైరా ఓ సైరా
ఓ సైరా ఓ సైరా ఓ సైరా ఓ సైరా
ఉషస్సు నీకు ఊపిరాయరా 



 

సోమవారం, డిసెంబర్ 02, 2019

జాగో నరసింహ జాగోరే...

సైరా నరసింహా రెడ్డి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సైరా నరసింహా రెడ్డి (2019)
సంగీతం : అమిత్ త్రివేదీ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శంకర్ మహదేవన్,
అనురాగ్ కులకర్ణి, హరిచరణ్

జాగో నరసింహ జాగోరే
జనమంతా చూసే నీ దారే
చెయ్యెత్తీ జైకొట్టే హోరే
తకథై అంటూ
సిందులు తొక్కాలే
వజ్రాల వడగళ్ళై
నవరతనాల సిరిజల్లై
మా నవ్వుల్లో
సుక్కలు కురవాలే
ఓ సై రా

ఝమాజం ఝంఝారావంలో
దమాదం దుమ్ముదుమారంలో
అమాంతం అందరి ఊపిరిలో
ఘుమాగుం చిందిన అత్తరులో
పది దిక్కులకీ అందిందీ ఈ సందేశం
సరిహద్దులు అన్ని చెరిపిన ఈ సంతోషం
ఉవ్వెత్తునిలా ఉప్పొంగిన ఈ ఉల్లాసం
ప్రతి ఒక్కరికి పంచేందుకని అవకాశమిదే

కన్నావటయ్యా మా దొర
మా సంబరాన్ని కన్నారా
ఉయ్యాలనాటి ఈడులా
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్యా మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడులా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
హేయ్.. ఊళ్ళన్నిటిని ఊగించేలా

ఏం జవాబు చెబుతాం రా
ఫలానా పక్కోడెవడంటే
ఈ మన్నేగా ఇద్దరినీ
కన్నదని అనరా నిజమంతే
నువ్వు బాగుంటే చాలంతే
ఆ మాటింటే మరి
నే కూడా సల్లంగా ఉన్నట్టే

ఈ జాతర సాక్షిగ కలిసిన మన సావాసం
మన కష్ట సుఖాలను పంచుకునేందుకు సిద్ధం
నువ్వు నా కోసం నేన్నీకోసం అనుకుందాం
మన అందరినీ ముడి వేసెనిలా మనిషన్న పదం

కన్నావటయ్యా మా దొర
మా సంబరాన్ని కన్నారా
ఉయ్యాలనాటి ఈడులా
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్యా మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడులా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
హే ఊళ్ళన్నిటిని ఊగించేలా

(హైస హైస హైస హైలెస్సా
హైస హైస హైస హైలెస్సా
హైస హైస హైస హైలెస్సా
హైస హైస హైస హైలెస్సా
హేయ్)

కన్నావటయ్యా మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడులా
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్యా మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడులా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.