రావూరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రావూరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, మే 02, 2016

మెల్ల మెల్లగా చల్ల చల్లగా...

చక్రపాణి చిత్రంలోని ఓ చల్లని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చక్రపాణి
సంగీతం : భానుమతి
రచయత : రావూరి రంగయ్య
గానం : భానుమతి

మెల్ల మెల్లగా చల్ల చల్లగా..రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా
రావే నిదురా హాయిగా

మెల్ల మెల్లగా చల్ల చల్లగా..రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా
రావే నిదురా హాయిగా

వెన్నెల డోలికాలా
పున్నమి జాబిలి పాపవై
కన్నులనూగవే చల్లగా 
రావే నిదురా హాయిగా
కన్నులనూగవే చల్లగా
రావే నిదురా హాయిగా

మెల్ల మెల్లగా చల్ల చల్లగా..రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా
రావే నిదురా హాయిగా

పిల్ల తెమ్మెరలా
వూదిన పిల్లన గ్రోవివై
జోల పాడవే తీయగా
రావే నిదురా హాయిగా
జోల పాడవే తీయగా
రావే నిదురా హాయిగా

మెల్ల మెల్లగా చల్ల చల్లగా..రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా
రావే నిదురా హాయిగా

కలువ కన్నియాలా
వలచిన తుమ్మెద రేడువే
కన్నుల వ్రాలవే మెల్లగా
రావే నిదురా హాయిగా
కన్నుల వ్రాలవే మెల్లగా
రావే నిదురా హాయిగా

మెల్ల మెల్లగా చల్ల చల్లగా..రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా
రావే నిదురా హాయిగా



మంగళవారం, డిసెంబర్ 29, 2015

నీలవర్ణ నీ లీలలు...

శ్రీకృష్ణ మాయ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీ కృష్ణమాయ (1958)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : రావూరి
గానం : ఘంటసాల

నీలవర్ణ నీ లీలలు తెలియా
నీలవర్ణ నీ లీలలు తెలియా
నా తరమా దేవాది దేవా
నీలవర్ణ నీ లీలలు తెలియా

మురళీధారీ మోహన రూపా 
మురళీ ధారీ ఆఅ..ఆఅ.ఆఆఆ...
మురళీధారీ మోహన రూపా 
మాయవీడెరా మహతి మ్రోగెరా 
మాయవీడెరా మహతి మ్రోగెరా
మాయవీడెరా మహతి మ్రోగెరా
మంగళగీతిని వినిపించు దేవా 
మంగళగీతిని వినిపించు దేవా

నీలవర్ణ నీ లీలలు తెలియా
నా తరమా దేవాది దేవా
దేవ దేవ దేవాది దేవా 
దేవ దేవ దేవాది దేవా
దేవాది దేవా దేవాది దేవా
దేవాది దేవా దేవాది దేవా


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.