సోమవారం, మే 02, 2016

మెల్ల మెల్లగా చల్ల చల్లగా...

చక్రపాణి చిత్రంలోని ఓ చల్లని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చక్రపాణి
సంగీతం : భానుమతి
రచయత : రావూరి రంగయ్య
గానం : భానుమతి

మెల్ల మెల్లగా చల్ల చల్లగా..రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా
రావే నిదురా హాయిగా

మెల్ల మెల్లగా చల్ల చల్లగా..రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా
రావే నిదురా హాయిగా

వెన్నెల డోలికాలా
పున్నమి జాబిలి పాపవై
కన్నులనూగవే చల్లగా 
రావే నిదురా హాయిగా
కన్నులనూగవే చల్లగా
రావే నిదురా హాయిగా

మెల్ల మెల్లగా చల్ల చల్లగా..రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా
రావే నిదురా హాయిగా

పిల్ల తెమ్మెరలా
వూదిన పిల్లన గ్రోవివై
జోల పాడవే తీయగా
రావే నిదురా హాయిగా
జోల పాడవే తీయగా
రావే నిదురా హాయిగా

మెల్ల మెల్లగా చల్ల చల్లగా..రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా
రావే నిదురా హాయిగా

కలువ కన్నియాలా
వలచిన తుమ్మెద రేడువే
కన్నుల వ్రాలవే మెల్లగా
రావే నిదురా హాయిగా
కన్నుల వ్రాలవే మెల్లగా
రావే నిదురా హాయిగా

మెల్ల మెల్లగా చల్ల చల్లగా..రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా
రావే నిదురా హాయిగా



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.