సోమవారం, మే 16, 2016

మొగలిపువ్వే మోనికా...

కీచురాళ్ళు సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం :కీచురాళ్ళు (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, చిత్ర

హలో ఐయామ్ హియర్

మొగలిపువ్వే మోనికా
సొగసు చూస్తే సోనీకా
మధువు కోరే తూనీగ
మొదటి కాటు మోతేగా
నీది రూపమా తేనె దీపమా
వాన చీర వయ్యారాలేల

మొగలిపువ్వే మోనికా
సొగసు చూస్తే సోనీకా
మధువు కోరే తూనీగ
మొదటి కాటు మోతేగా

సాయంత్రం సందెల్లోనా
స్నానాలు చేసే ట్యూనే సంగీతమా
చుంబించు చూపుల్లోనా
బింబించు బింకాలన్నీ సౌందర్యమా
వైశాఖ మాసం వైజాగు తీరం
ఈ రాధ కోరే బృందా విహారం
ఆరు తీగలా నీగిటారుతో
రార వేణుగోపాల బాల

మొగలిపువ్వే మోనికా
సొగసు చూస్తే సోనీకా
మధువు కోరే తూనీగ
మొదటి కాటు మోతేగా

లకుముకి చెకుముకి చంచం
చెకుముకి లకుచికు చంచం
వల్లంకి పిట్తరో వావిలి గుంట
ముసినవ్వు పంటరో ముద్దులగుంట
ఝల్లంది ఎక్కడో జాబిలి జంట
దానినవ్వుల్లో ఉందిరో మన్మధ మంట
తుళ్ళింత రేగితే తొక్కిడి తంట
కొత్త కవ్వింత పండితే కోరిన జంట

వేసంగి వీధుల్లోనా
వెన్నెల్ల షెల్టరు లోనే శృంగారమా..
శ్రీరంగ నీతుల్లోనా
చీకట్లు ఓకే అంటే సంసారమా
నీ కిస్కిమోలు కొట్టే సవాలు
నా ఎస్కిమోలు కోరే ధృవాలు  
నీ తరంగమే నేను తాకితే
ఏ మృదంగమో మోగే వేళ

మొగలిపువ్వే మోనికా
సొగసు చూస్తే సోనీకా
మధువు కోరే తూనీగ
మొదటి కాటు మోతేగా

నీది రూపమా తేనె దీపమా
వాన చీర వయ్యారాలేల

మొగలిపువ్వే మోనికా
సొగసు చూస్తే సోనీకా

మధువు కోరే తూనీగ
మొదటి కాటు మోతేగా


3 comments:


మధువును కోరెను తూనీ
గ!దరువు వేయగ జిలేబి కమ్మగ వచ్చెన్ !
అధరము బెదిరెను సరిగమ
లదిరెను రాజా ! ఇళయపు లవ్వే యనగన్ !

సావేజిత
జిలేబి

అపుడపుడూ మీ పాటల కదంబం లో నాకు తెలియని పరిమళాలు ఉన్నాయా అని ఎంచటం అలవాటు శ్రీకాంత్... ఇదిగో ఈ మొగలిపూపాట నాకు తెలీని ఆఘ్రాణింపు... మీ పాటల తోట లో వన భోజనానికి మాసం, వీసా అక్కర్లేదు, భలే!

థాంక్స్ ఫర్ ద కామెంట్ ఉష గారు :-) ఈ సినిమా బాగోదు కాని ఈ పాట మరో ఉషాఊతుప్ పాట బానే ఉంటాయండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.