గూడుపుఠాణి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈపాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : గూడుపుఠాణి (1972)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం : దాశరథి
గానం : బాలు, సుశీల
తనివి తీరలేదే
నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
చెలియా ఓ చెలియా
ఎన్నో వసంతవేళలలో
వలపుల ఊయలలూగామే
ఎన్నో వసంతవేళలలో
వలపుల ఊయలలూగామే
ఎన్నో పున్నమిరాత్రులలో
వెన్నెల జలకాలాడేమే
అందని అందాల అంచుకే చేరిననూ
అందని అందాల అంచుకే చేరిననూ
విరిసిన పరువాల లోతులే చూసిననూ
తనివి తీరలేదే ఆఆఅ..ఆఅ
నా మనసు నిండలేదే ఆఆఆ...
ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా
తనివి తీరలేదే ఆఆఅ..ఆఅ
నా మనసు నిండలేదే ఆఆఆ...
ఏనాటి బంధమీ అనురాగం
ప్రియతమా ఓ ప్రియతమా
ఎప్పుడు నీవే నాతో ఉంటే
ఎన్ని వసంతాలైతేనేమి
ఎప్పుడు నీవే నాతో ఉంటే
ఎన్ని వసంతాలైతేనేమి
కన్నుల నీవే కనబడుతుంటే
ఎన్ని పున్నమలు వస్తేనేమి
వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ
తనివి తీరలేదే ఆఆఅ..ఆఅ
నా మనసు నిండలేదే ఆఆఆ...
ఏనాటి బంధమీ అనురాగం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.