మంగళవారం, మే 24, 2016

అమ్మ సంపంగి రేకు...

శత్రువు సినిమా కోసం రాజ్-కోటి స్వరపరచిన ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : శత్రువు (1990)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు
అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు  
పుచ్చుకుంటాలే నీ పూతరేకు
విచ్చుకుంటా గానీ వీడిపోకూ 
జై మదన కామ నా ప్రేమ
ఈ భామ సయ్యంటె మోతరో..
నా వలపు భీమా నా సోకు
నాజూకు పువ్వంత లేతరో..

అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు
అమ్మ సంపంగి రేకూ..

కలే కలై కలయికే సెగై చలి ఇలా ఇలా ముగిసే
సరే సరే గడుసరే జతై మగసిరి పురి తెలిసే 
శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ పైట జారిందిలే
శ్రీవారే చిత్తై పోయే సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే 
సయ్యంటే నీ కళ్ళూ సందిళ్ళే పందిళ్ళూ
ముద్దంటే చెక్కిళ్ళూ సన్నాయి మద్దెళ్ళూ 
మాపటేల దీపమేలా చందమామలాంటి పిల్ల
చందనాలు చల్లిపోతే

అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు
అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు  
పుచ్చుకుంటాలే నీ పూతరేకు
విచ్చుకుంటా గానీ వీడిపోకూ
 
యమో యమో చలి ఉపాయమో కసి కథాకళీ తెలిసే 
నమో నమో మరుని బాణమో విరిదుకాణమో తెరిసే
నీ చూపులు ఛూమంత్రాలై సాయంత్రా లాభాలు కోరేనులే 
నీ బుగ్గలు తాంబూలాలై నా ముద్దుల గోరింట పండేనులే
ఇంకేమీ ఇవ్వాలో తమకేమీ అవ్వాలో  
ఒకటైతే మనసివ్వూ రెండైతే ఒకటవ్వు
మంచిరోజూ పొంచిఉంది మావిడాకు తోరణాల
మల్లెపూల శోభనాలలో

 
అమ్మ సంపంగి రేకు అల్లాడె పిల్ల సోకు
అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు  
పుచ్చుకుంటాలే నీ పూతరేకు
విచ్చుకుంటా గానీ వీడిపోకూ
జై మదన కామ నా ప్రేమ
ఈ భామ సయ్యంటె మోతరో..
నా వలపు భీమా నా సోకు
నాజూకు పువ్వంత లేతరో..

 
అమ్మ సంపంగి రేకు అబ్బ కొట్టింది షాకు
అమ్మ సంపంగి రేకూ..

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.