ఆదివారం, మే 22, 2016

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు...

రాక్షసుడు సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : రాక్షసుడు (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు..
మల్లె జాజి అల్లుకున్న రోజు..
జాబిలంటీ ఈ చిన్నదాన్ని..
చూడకుంటే నాకు వెన్నెలేది..

ఏదో అడగాలనీ.. 
ఎంతో చెప్పాలనీ..
రగిలే ఆరాటంలో..
వెళ్ళలేను.. ఉండలేను.. ఏమి కాను...
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లె జాజి అల్లుకున్న రోజు

చేరువైనా రాయబారాలే
చెప్పబోతే మాట మౌనం
దూరమైన ప్రేమధ్యానాలే
పాడలేని భావగీతం
ఎండల్లో.. వెన్నెల్లో.. ఏంచేతో..
ఒక్కరం ఇద్దరం అవుతున్నా
వసంతాలు ఎన్నొస్తున్నా
కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబూస్తున్నా
తోటమాలి జాడేది
నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా...

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లె జాజి అల్లుకున్న రోజు

కళ్ళనిండా నీలిస్వప్నాలే..
మోయలేని వింత మోహం
దేహమున్న లేవు ప్రాణాలే..
నీవు కాదా నాకు ప్రాణం
సందింట్లో ఈ మొగ్గే పూయనీ
రాగాలే బుగ్గల్లో దాయనీ
గులాబీలు పూయిస్తున్నా
తేనేటీగ అతిధేడి
సందెమబ్బులెన్నొస్తున్నా
స్వాతి చినుకు తడుపేది
రేవులో నావలా నీ జతే కోరదా

జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుంటే నీకు వెన్నెలేది
ఏదో అడగాలనీ
ఎంతో చెప్పాలనీ
రగిలే ఆరాటంలో..
వెళ్ళలేను.. ఉహ్మ్..
ఉండలేను.. ఉహ్మ్...
ఏమి కాను... హా..

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లె జాజి అల్లుకున్న రోజు
లలలల.. లలలలలాలా
ఉహ్మ్.. ఉహ్మ్.. హహహహా..

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.