ఇంద్రుడు చంద్రుడు సినిమా కోసం ఇళయరాజా గారు స్వర పరచిన ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాటఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఇంద్రుడు చంద్రుడు (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన
తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన
ఆగమన్నా నీమీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా
వద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా
దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన
తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన
నీ చలి నా గిలి ఓపలేను అందగాడా
నీ శృతి నా లయ ఏకమైన సందెకాడ
అంటినా ముట్టినా అమ్మగారూ
అగ్గిపై గుగ్గిలం నాన్నగారు
ఎంత పడి చస్తున్నానో వెంటపడి వస్తున్నాను
తెలిసిందా ఓ కుర్రోడా దక్కనివ్వు నా మర్యాద
ఓకేలే ఒకే ముద్దిచ్చేసి ముద్రిస్తా మన ప్రేమ జెండా
దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన
తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన
ఆగమన్నా నీమీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా
వద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా
దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన
తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన
వేళనీ పాళనీ లేనిదమ్మ వెర్రి ప్రేమ
గుట్టనీ మట్టనీ ఆగదమ్మ కుర్ర ప్రేమ
అందుకే సాగనీ రాసలీల
అందమే తోడుగా ఉన్న వేళ
ఎంత కసి నాలో ఉందో ఎంత రుచి నీలో ఉందో
తెలిసాకే ఓ అమ్మాయి కలిసాయి చేయి చేయి
కానిలే సరే కవ్వించెయ్యి కౌగిట్లో ప్రియా కమల నయనా
దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన
తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన
ఆగమన్నా నీమీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా
వద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా
దోర దోర దొంగముద్దు దోబూచి హొయన హొయన
తేర తేర తేనెబుగ్గ లాగించి హొయన హొయన
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.