ఆదివారం, మే 15, 2016

ఆయి ఆయి శ్రీ రంగశాయి...

పెళ్ళిపుస్తకం చిత్రంలోని ఓ హాయైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : సుశీల

ఆయియి యి శ్రీ రంగశాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
ఆయియి యి శ్రీ రంగశాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి


ఏదీకాని వేళా ఎడద ఉయ్యాల
ఏదీకాని వేళా ఎడద ఉయ్యాల..
కోరి జో కొట్టింది కుసుమ సిరిబాల
ఆయియి యి శ్రీ రంగశాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి


అజ్ఞాత వాసాన అతివ పాంచాలి
ఆరళ్లు భీమన్న దూరమ్ముసేయు
ఆవేశ పడరాదు అలసిపోరాదు
అభిమానమే చాలు అణుచుకొన మేలు

ఆయి ఆయి శ్రీ రంగశాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి
ఆయి ఆయి శ్రీ రంగశాయి


నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే
భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు
నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే
భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు

మాగన్నులోనైన మరచిపో కక్ష
సిరి కనుల నిద్దురకు శ్రీరామరక్షా..

 
 

1 comments:



ఎడదన జిలేబి ఉయ్యా
లిడగ మగడు జోయనే భళీయని యిచటన్ !
పడతి గదా పతియన సే
విడు రామా !మది గొనమ్మ ! విడువకు వినుమా !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.