వంశీ గారి స్వీయ సంగీత దర్శకత్వంలో వచ్చిన నీకు 16 నాకు 18 చిత్రంలోని ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : నీకు16 నాకు18 (1994)
సంగీతం : వంశీ
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, చిత్ర
వేచి వేచి వే వేచివేచి వేసారిపోయాను
చిరుగాలి నోచుకోనీ చివురాకునైనాను
విరహాలనేలే రాణి త్రివేణి
చూసి చూసి నీవేపే చూసి ఏమారిపోయాను
నువులేక నాలోనేను వసివాడిపోతుంటే
అణగారిపొయే ఆశ నిరాశై
నా ప్రాణమా ఇదో శాపమా
వెన్నెలమ్మా తారాడినా కన్నెమబ్బు పారాడినా
తొంగి చూశా నీవేనని కుంగిపోయా రాలేదనీ
ఒక నిముషం కనపడవా ఎద సొదలూ వినపడవా
చెలియా సఖియా లలనా రావే
విరహాలు తాళగ లేనే మరాళీ
చూసి చూసి నీవేపే చూసి ఏమారిపోయాను
నువులేక నాలోనేను వసివాడిపోతుంటే
అణగారిపొయే ఆశ నిరాశై
ఆవేదన అదో శోధన
చెప్పనిదీ ఆ హాయిలో చిక్కుకున్నా నీ ఊహలో
పక్కనున్నా రాలేకనే సొక్కుతున్నా ఈ రేయిలో
నిను విడిచీ మనగలనా విధిలిఖితం అనగలనా
కరిగే కలగానైనా రావా
పరువాల పూలే రాలె వనానా
వేచి వేచి వే వేచివేచి వేసారిపోయాను
చిరుగాలి నోచుకోనీ చివురాకునైనాను
విరహాలనేలే రాణి త్రివేణి
1 comments:
వేచి వేచి వేచి వేసారి పోయాను
చూసి చూసి కలిసె చూపు రాణి !
విడిచి మనగల మన విధిలిఖితము గాదు !
వాణి లేకయు వసి వాడి బోతి !
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.