బుధవారం, మే 04, 2016

చిటారు కొమ్మను మిఠాయి పొట్లం...

కన్యాశుల్కం చిత్రంలోని ఓ హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : కన్యాశుల్కం (1955)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం : ఘంటసాల

చిటారు కొమ్మను చిటారు కొమ్మను
చిటారు కొమ్మను చిటారు కొమ్మను
మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
హోయ్ చిటారు కొమ్మను

పక్కను మెలిగే చక్కని చుక్కకు
చక్కిలిగింత లేదేం గురుడా
ఆపక్కను మెలిగే చక్కని చుక్కకు
చక్కిలిగింత లేదేం గురుడా
కంచు మోతగా కనకం మోగదు
నిదానించరా నరుడా
కంచు మోతగా కనకం మోగదు
నిదానించరా నరుడా

వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
హోయ్ చిటారు కొమ్మను

పండంటి పిల్లకు పసుపు కుంకం
నిండుకున్నవేం గురుడా
పండంటి పిల్లకు పసుపు కుంకం
నిండుకున్నవేం గురుడా
దేవుడు చేసిన లోపాన్ని
నీవు దిద్దుకురారా నరుడా
దేవుడు చేసిన లోపాన్ని
నీవు దిద్దుకురారా నరుడా
కొద్దిగ హద్దు మీరరా నరుడా

చిటారు కొమ్మను మిఠాయి పొట్లం
చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
హోయ్ చిటారు కొమ్మను

విధవలందరికి శుభకార్యాలు
విధిగా చెయమంటావా గురుడ
విధవలందరికి శుభకార్యాలు
విధిగా చెయమంటావా గురుడా
అవతారం నీదందుకోసమే..ఏ..
అవతారం నీదందుకోసమె
ఆరంభించర నరుడా

వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
హోయ్ చిటారు కొమ్మను

చిటారు కొమ్మను
మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా
వాటం చూసి వడుపు చేసి
వంచర కొమ్మను నరుడ
హోయ్ చిటారు కొమ్మనూ0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.