వీటూరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వీటూరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, నవంబర్ 05, 2020

ఆడవే అందాల సురభామిని...

యమగోల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : యమగోల (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వీటూరి
గానం : బాలు, సుశీల

ఆడవే అందాల సురభామిని
ఆడవే అందాల సురభామిని 
పాడవే కళలన్నీ ఒకటేననీ
ఆడవే అందాల సురభామిని
గానమేదైనా స్వరములొక్కటే
పనిపస నిసనిగ నిపమగ 
మపగస మగసని సగని
నాట్యమేదైనా నడక ఒక్కటే 
భాష ఏదైనా భావమొక్కటే 
అన్ని కళల పరమార్థమొక్కటే 
అందరినీ రంజింపజేయుటే

ఆ.ఆ.. ఆడవే అందాల సురభామిని

ఓహో రంభా.. సకల కళానికురంభా
రాళ్ళనైనా మురిపించే జాణవట 
అందానికి రాణివట
ఏదీ.. నీ హావభావ విన్యాసం
ఏదీ.. నీ నాట్యకళాచాతుర్యం

ఆఆఆ... ఆఆఆ ... ఆఆఆఆఆఆ

అరువది నాలుగు కళలందు మేటిని 
అమరనాథునికి ప్రియ వధూతిని
అరువది నాలుగు కళలందు మేటిని 
అమరనాథునికి ప్రియ వధూతిని
సరసాలలో.. ఈ సురశాలలో..
సరసాలలో.. ఈ సురశాలలో..
సాటిలేని శృంగార వాసిని..
నిత్యనూతన రాగ స్రవంతిని.. 
రసవంతిని జయ జయవంతిని ..
రసవంతిని.. జయ జయవంతిని

ఆడవే అందాల సురభామిని 
పాడవే కళలన్నీ ఒకటేననీ
ఆడవే అందాల సురభామిని
ఓహో ఊర్వశీ.. అపురూప సౌందర్య రాశి
ఏదీ.. నీ నయన మనోహర నవరస లాస్యం
ఏదీ.. నీ త్రిభువన మోహన రూప విలాసం

మదనుని పిలుపే నా నాదము.. 
స్మర కదన శాస్త్రమే నా వేదము
మదనుని పిలుపే నా నాదము.. 
స్మర కదన శాస్త్రమే నా వేదము
కనువిందుగా.. కరగని పొందుగా.. 
కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము
అంతులేని శృంగార పిపాసిని.. 
తరతరాల మీ ప్రేయసిని... చారుకేశిని..

ఆడవే అందాల సురభామిని.. 
పాడవే కళలన్నీ ఒకటేననీ..
ఆడవే అందాల సురభామిని..
 
ఓహో మేనకా!.. మదన మయూఖా
సాగించు నీ రాసలీలా.. 
చూపించు శృంగార హేలా.. 
సాగించు నీ రాసలీలా

నగవులతో మేని బిగువులతో..
నగవులతో మేని బిగువులతో.. 
వగలొలికించు వయ్యారి నెరజాణను
ఏ చోట తాకినా.. ఏ గోట మీటినా.. 
మధువులొలికించు మరులు చిలికించు
మధురమైన రసవీణను.. 
రతిరాజ కళా ప్రవీణను.. 
సారంగలోచనను..

ఆడవే అందాల సురభామిని.. 
పాడవే కళలన్నీ ఒకటేననీ.. 
ఆడవే అందాల సురభామిని 
 


మంగళవారం, జూన్ 30, 2020

కన్నుల్లో మిసమిసలు...

దేవత చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : దేవత (1965)
సంగీతం : కోదండపాణి 
సాహిత్యం : వీటూరి
గానం : ఘంటసాల, సుశీల 

కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ

నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు
నీ చూపుతో నన్ను ముడివేయకు

సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నాపైట చెంగులాగి కవ్వించకు
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నాపైట చెంగులాగి కవ్వించకు

అనువైనవేళ అందాలు దాచకు
అనువైనవేళ అందాలు దాచకు
అణువణువు నిన్నే కోరె మురిపించకు
ఇకనైనా నిను సిగ్గు తెరవేయకూ

నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ..ఈ..

ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే
మొహాలతో నన్ను మంత్రించకు
ఎటుచూసినా నువ్వే వినిపించె నీ నవ్వే
మొహాలతో నన్ను మంత్రించకు

మనలోని ప్రేమ మారాకు వేయనీ 
మనలోని ప్రేమ మారాకు వేయనీ
మనసార ఒడిలో నన్ను నిదురించనీ
నీ నీలి ముంగురులు సవరించనీ

నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు

కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ..ఈ..
 

సోమవారం, అక్టోబర్ 07, 2019

ప్రతి కోణమ్ములో...

గౌరీ మహిమలు చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గౌరీ దేవి మహిమలు (1984)
సంగీతం : యం.యస్.విశ్వనాథం
సాహిత్యం : వీటూరి
గానం : బాలు

ప్రతి కోణమ్ములో ప్రతి భాగమ్ములో
దివ్యకాంతి తిలకించితీ
ప్రతి కోణమ్ములో ప్రతి భాగమ్ములో
దివ్యకాంతి తిలకించితీ


చిరు లాస్యాలతో దర హాసాలతో
హృదయానా పులకించితీ
హృదయానా పులకించితీ
చిరు లాస్యాలతో దర హాసాలతో
హృదయానా పులకించితీ
హృదయానా పులకించితీ

ప్రతి కోణమ్ములో ప్రతి భాగమ్ములో
దివ్యకాంతి తిలకించితీ


ఘనమైన సిగమేన నెలవంకనే కన్నా
రెప్పల నీడల్లో నెరి చూపులే కన్నా
విరిసిన కమలములా కమలములా
విరిసిన కమలముల వదనమునే కన్నా
వదనానా.. నయనానా..
అధరాల కలువలనే కన్నా
విరిసిన కమలముల వదనమునే కన్నా
పెదవుల నవ్వుల్లో కోటి దివ్వెలు కన్నా
పెదవుల నవ్వుల్లో కోటి దివ్వెలు కన్నా

ప్రతి కోణమ్ములో ప్రతి భాగమ్ములో
దివ్యకాంతి తిలకించితీ


అందముగా గళము విందులు చేయంగా
అందముగా గళము విందులు చేయంగా
సుందర రూపాన ముందర నిలవంగా
సుందర రూపాన ముందర నిలవంగా
జఘనము కదలాడ మెల్లగ నడుమాడా
వయ్యారమొలికించే పిరుదులు తూగాడా
జఘనము కదలాడ మెల్లగ నడుమాడా
వయ్యారమొలికించే పిరుదులు తూగాడా
వర్ణన సేయంగ తల్లీ నేనెంత
చెప్పలేని అందమంతా విశ్వమంతా నిండెనంతా

ప్రతి కోణమ్ములో ప్రతి భాగమ్ములో
దివ్యకాంతి తిలకించితీ

భాను కిరణ స్వర్ణారుణ మయము
దేవి చరణ పంకేహములే
జీవరాశి బ్రోవ నెంచి ఏర్పడె
దేవి కరుణ దివ్యా అమృతములై
కులుతు గజ్జలు ఘుమ్మని మ్రోయగ
కోమలి నుదుటను కుంకుమ వెలుగగ
జగతిని కళలకు అధిదేవతగా
సాగర ఘోషగ శభ్దము పలుకగ
తకిట తకిట తకిట తకిట తోం అని
రవళించి నాట్యాలాడగ
స్వరరాగ గీతం పాడగా
అంభోనిధులల్లాడగ
జగములు కొనియాడే అభినయ నాయకి
చిత్రానికి వింతై గిలిగింతై రమణి
రాగ లయల హొయల పలుకరించవే
అతి మధుర కవితలకు శృతి భరిత ధృతములకు   
ప్రతి ధ్వనులె గిరులందు మ్రోగా
వేల్పులంత ప్రస్తుతించి కొలువగ
జీవరాశి సంభ్రమాన నిలువగ
ఆడుతూ పాడుతూ భక్తుని కరుణను చూడవా

ప్రతి కోణమ్ములో ప్రతి భాగమ్ములో
దివ్యకాంతి తిలకించితీ
 

శుక్రవారం, ఆగస్టు 16, 2019

ధాన్య లక్ష్మి వచ్చిందీ...

భక్తతుకారం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భక్తతుకారం (1973)
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : వీటూరి
గానం : సుశీల

ధాన్య లక్ష్మి వచ్చిందీ మా ఇంటికి
మా కరువు తీరింది ఈ నాటికి
మా లక్ష్మి వచ్చింది మా ఇంటికి
మా కరువు తీరింది ఈ నాటికి

పాల సంద్రంలోన పుట్టిన నా తల్లి
పాల సంద్రంలోన పుట్టిన నా తల్లి
భాగ్యాలు కరుణించు ఓ !కల్పవల్లి

ధాన్య లక్ష్మి వచ్చిందీ మా ఇంటికి
మా కరువు తీరింది ఈ నాటికి

సువ్వి సువ్వన్నాలే సువ్వన్న లాలే ఓ యమ్మా!
సూరమ్మ మా వారు ఎప్పుడొస్తారే
ఆ హు ...ఆహు ..అహుం..

ఏన్నిభోగాలున్న ఎంత భాగ్యమున్న ఓ యమ్మా !
మగనికన్నా ధనముకాదమ్మా !
ఆహుం...ఆహుం ...అహుం ...

పిల్లల ఆకలి తల్లి ఎరుగును కానీ ఓ యమ్మా !
అడవుల్లో తిరిగే ఆయ్యే ఏమిఎరుగు
ఆ అయ్య ఏమి ఎరుగు
ఆహుం ...ఆహుం ...ఆహుం ....

బ్రమ్మకే పాయసం
జాజిరి జాజిరి జాజిరి
నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి
జాజిరి జాజిరి జాజిరి
నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి

చూడబోతే తాను సుందరీ
ఆడమంటే చాలు అల్లరీ
చూడబోతే తాను సుందరీ
ఆడమంటే చాలు అల్లరీ
కట్టుకున్న వాడు నంగిరీ
సంతానమే బీర పందిరీ
కట్టుకున్న వాడు నంగిరీ
సంతానమే బీర పందిరీ
వండుకున్నమ్మకు ఆయాసం 
దండుకున్నమ్మకే పాయసం
వండుకున్నమ్మకు ఆయాసం 
దండుకున్నమ్మకే పాయసం

జాజిరి జాజిరి జాజిరి
నీ ఇల్లే కస్తూరి లాహిరి
మా ఇల్లే కస్తూరి లాహిరి


మంగళవారం, ఆగస్టు 13, 2019

సిరులను కురిపించే...

లక్ష్మీ పూజ చిత్రంలో ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లక్ష్మీ పూజ (1979)
సంగీతం : సత్యం
సాహిత్యం :  వీటూరి
గానం : జానకి

శ్రీ లక్ష్మీ... జయలక్ష్మీ.. 
సిరులను కురిపించే శ్రీలక్ష్మీ
కరుణించ రావే మహాలక్ష్మీ
మము కరుణించ రావే మహాలక్ష్మీ
సిరులను కురిపించే శ్రీలక్ష్మీ
కరుణించ రావే మహాలక్ష్మీ
మము కరుణించ రావే మహాలక్ష్మీ

పాలకడలిలో ప్రభవించినావు
మురిపాల మాధవుని వరియించినావు
పాలకడలిలో ప్రభవించినావు
మురిపాల మాధవుని వరియించినావు
శ్రీపతి హృదయానా...
శ్రీపతి హృదయాన కొలివైతివమ్మా
నా పతి పాదాల నను నిలుపవమ్మా

సిరులను కురిపించే శ్రీలక్ష్మీ
కరుణించ రావే మహాలక్ష్మీ
మము కరుణించ రావే మహాలక్ష్మీ

అన్ని జగాలకు మూలము నీవే ఆదిలక్ష్మివమ్మా
పాడిపంటలను ప్రసాదించు నవ ధాన్యలక్ష్మివమ్మా
భీరులనైనా ధీరులజేసే ధైర్యలక్ష్మివమ్మా
జగతికి జయమును కలిగించే గజలక్ష్మివి నీవమ్మ
వంశము నిలిపే పాపలనిడు సంతానలక్ష్మివమ్మా
కార్యములన్నీ సఫలము జేసే విజయలక్ష్మివమ్మా
జనులకు విధ్యాభుద్దులు నేర్పే విద్యాలక్ష్మి నీవమ్మా
సర్వ సౌభాగ్యములను సంపదనిచ్చే భాగ్యలక్ష్మివి నీవమ్మా

సిరులను కురిపించే శ్రీలక్ష్మీ
కరుణించ రావే మహాలక్ష్మీ
మము కరుణించ రావే మహాలక్ష్మీ


శుక్రవారం, ఆగస్టు 11, 2017

సిరులను కురిపించే శ్రీలక్ష్మీ...

లక్ష్మీ పూజ చిత్రంలో ఒక చక్కని పాట ఈ శ్రావణ శుక్రవారం రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లక్ష్మీ పూజ (1979)
సంగీతం : సత్యం
సాహిత్యం :  వీటూరి
గానం : జానకి

శ్రీ లక్ష్మీ... జయలక్ష్మీ.. 
సిరులను కురిపించే శ్రీలక్ష్మీ
కరుణించ రావే మహాలక్ష్మీ
మము కరుణించ రావే మహాలక్ష్మీ
సిరులను కురిపించే శ్రీలక్ష్మీ
కరుణించ రావే మహాలక్ష్మీ
మము కరుణించ రావే మహాలక్ష్మీ

పాలకడలిలో ప్రభవించినావు
మురిపాల మాధవుని వరియించినావు
పాలకడలిలో ప్రభవించినావు
మురిపాల మాధవుని వరియించినావు
శ్రీపతి హృదయానా...
శ్రీపతి హృదయాన కొలివైతివమ్మా
నా పతి పాదాల నను నిలుపవమ్మా

సిరులను కురిపించే శ్రీలక్ష్మీ
కరుణించ రావే మహాలక్ష్మీ
మము కరుణించ రావే మహాలక్ష్మీ

అన్ని జగాలకు మూలము నీవే ఆదిలక్ష్మివమ్మా
పాడిపంటలను ప్రసాదించు నవ ధాన్యలక్ష్మివమ్మా
భీరులనైనా ధీరులజేసే ధైర్యలక్ష్మివమ్మా
జగతికి జయమును కలిగించే గజలక్ష్మివి నీవమ్మ
వంశము నిలిపే పాపలనిడు సంతానలక్ష్మివమ్మా
కార్యములన్నీ సఫలము జేసే విజయలక్ష్మివమ్మా
జనులకు విధ్యాభుద్దులు నేర్పే విద్యాలక్ష్మి నీవమ్మా
సర్వ సౌభాగ్యములను సంపదనిచ్చే భాగ్యలక్ష్మివి నీవమ్మా

సిరులను కురిపించే శ్రీలక్ష్మీ
కరుణించ రావే మహాలక్ష్మీ
మము కరుణించ రావే మహాలక్ష్మీ


శుక్రవారం, మార్చి 03, 2017

హల్లో మై రీటా...

వయసుపిలిచింది సినిమాలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : వయసు పిలిచింది (1978)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వీటూరి
గానం : బాలు

మాటే మరచావే..చిలకమ్మ..మనసువిరిచావే 
అంతట నీవే కనిపించి..అలజడి రేపావే
కమాన్ క్లాప్స్..
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ

హల్లో మై రీటా ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ

నీ పెదవులు..చిలుకును మధురసం
నీ హృదయం మాత్రం..పాదరసం
నీ పెదవులు..చిలుకును మధురసం
నీ హృదయం మాత్రం..పాదరసం
నాలో రేపావూ..ఊ..జ్వాల
ఒకరితో పాడేవూ..ఊ..జోల
నను మరచి పోవడం..న్యాయమా
మనసమ్మినందుకు నమ్మినందుకు 
వలపు గుండెకే..గాయమా
కథలే మారెను కలలే మిగిలెను హే..ఏయ్

హల్లో మై రీటా ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ

ప్రేమన్నది..దేవుని కానుక
అది నీకు కేవలం..వేడుక
ప్రేమన్నది..దేవుని కానుక
అది నీకు కేవలం..వేడుక
కృష్ణుడు ఆశపడి...రాగ
రాధిక వేరు పడి...పోగా
ఎడబాటు సహించదు హృదయము
ఒకనాటికెైన నీ జీవితాన..
కనరాకపోవు నా ఉదయము 
నిజమే తెలుసుకో గతమే తలచుకో..హేయ్

హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ
మాటే మరచావే..ఏఏఏ..చిలకమ్మ
మనసువిరిచావే..ఏఏఏ

ఆదివారం, డిసెంబర్ 18, 2016

మాధవా మాధవా...

శ్రీరామ కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీరామ కథ (1968)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం : వీటూరి
గానం : సుశీల, ఘంటాసాల 

మాధవా మాధవా మాధవా మాధవా
నను లాలించరా నీ లీలా కేళీ చాలించరా 
బాలను నేను తాళగ లేనూ 
బాలను నేను తాళగ లేనూ 
అలసి మనసే తూలెరా...ఆఅ..ఆ

ఓ చెలీ... ఓ సఖీ.. ఈఈఈఈ

దాగని వలపు దాచగ లేను 
వేగమెరా రా దోచుకు పోరా 
దాగని వలపు దాచగ లేను 
వేగమెరా రా దోచుకు పోరా 
కన్నుల పూచే వెన్నెల పూలూ 
వాడక మునుపే చేకొనరా
కన్నుల పూచే వెన్నెల పూలూ 
వాడక మునుపే చేకొనరా

ఓ చెలీ... ఓ సఖీ.. ఈఈఈఈ
సదా నీ వాడనే అందాలా దేవీ అలుకేలనే 
సందిటిలోనా బందీ చేసీ 
సందిటిలోనా బందీ చేసీ 
సరగున నన్నే ఏలవే...ఏఏఏ
మాధవా మాధవా...ఆఆఅ...ఆఆఆ...
 
మేఘమాలికల డోలికలూగీ 
మేనులు మరిచి విహరించేమా..
మేఘమాలికల డోలికలూగీ 
మేనులు మరిచి విహరించేమా..
ఏకాంతముగా పువ్వుల దాగీ 
విశ్వప్రేమనే వివరించేమా.. ఆఅ..అ
ఏకాంతముగా పువ్వుల దాగీ 
విశ్వప్రేమనే వివరించేమా.. ఆఅ..అ
ఓ చెలీ... ఓ సఖీ.. ఈఈఈఈ

బ్రతుకున వరము ఈ పరవశము 
కమ్మని కల ఇదే కరిగించకుమా 
బ్రతుకున వరము ఈ పరవశము 
కమ్మని కల ఇదే కరిగించకుమా 
నీవే నేనుగ నేనే నీవుగా 
నిఖిలము నిండీ లీనమయేమా.. 

మాధవా మాధవా నను లాలించరా 
నీ లీలా కేళీ తేలించరా... 
ఓ చెలీ... ఓ సఖీ.. ఈఈఈఈ
సదా నీ వాడనే అందాలా దేవీ నీ వాడనే 
ఓ చెలీ... ఓ సఖీ.. ఆఆఆఆఆ
 
 

మంగళవారం, నవంబర్ 22, 2016

ఆలయాన వెలసిన...

దేవత చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవత (1965)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం : వీటూరి
గానం : ఘంటసాల

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

పతిదేవుని మురిపించే వలపుల వీణా
జీవితమే పండించే నవ్వుల వానా
కష్ట సుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ
కష్ట సుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ
మగువేగా మగవానికి మధురభావనా

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగా
సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి


శుక్రవారం, జులై 08, 2016

పరిమళించు పున్నమిలో...

రాజన్ నాగేంద్ర గారు స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : పులి-బెబ్బులి (1983)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సంగీతం : వీటూరి
గానం : బాలు, సుశీల

పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
ఆ..... ఆ.... ఆ....
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది

మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో


ఆ ఆ ఆ 
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది

నవ్వగనే.. నవయవ్వనమే పువ్వులు రువ్విందిలే
తానె విరితేనై తానాలు ఆడిందిలే
నిన్ను గని.. ఎద కోయిలగ రాగాలు తీసిందిలే
నాలో ఎలమావి ఉయ్యలలూగిందిలే
చెలిమికిదే చైత్రమనీ.. నా ఆశ పూసింది..
అందాల బృందావిహారాలలో


పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
అందమిదే.. మకరందమిదే.. నా జీవితానందమే
నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే
బంధమిదే.. సుమగంధమిదే.. ఏ జన్మ సంబంధమో
నాలో విరితావి వెదజల్లిపోయిందిలే
జాబిలిగా.. వెన్నెలగా.. ఈ జంట కలిసింది
కార్తిక పూర్ణిండు మాసాలలో

పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో
మౌనమే.. గానమై.. మధుమాసవేళలో

శుక్రవారం, ఆగస్టు 29, 2014

ఎవరవయ్యా..ఎవరవయ్యా...

శ్రీ వినాయక విజయం సినిమాలో చిన్నారి వినాయకుణ్ణి ఉద్దేశించి పార్వతీ దేవి పాడే ఈ పాట నాకు చాలా ఇష్టం, దేవులపల్లి వారి రచన ఆకట్టుకుంటే సాలూరి వారి సంగీతం మార్ధవంగా సాగి మనసుకు హాయినిస్తుంది. వినాయక చవితి సంధర్బంగా మీరూ ఈ చక్కని పాట చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : శ్రీ వినాయక విజయం(1979)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : పి.సుశీల

ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..
ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..
ఎవరవయ్యా...

ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని
ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని
ఆ నవులు పలికేవి ఏ వేద మంత్రాలో
వేల్పులందరిలోనా తొలి వేల్పువో ఏమో
పూజలలో మొదటి పూజ నీదేనేమో !
పూజలలో మొదటి పూజ నీదేనేమో !

ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..
ఎవరవయ్యా..

చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ
చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ
ఇంతలో ఔరౌర ఎన్నెన్ని విద్యలో
ఎన్నెన్ని వింతలో...
ఎన్నెన్ని కోరికలు నిండి నే కన్న
ఎన్నెన్నో స్వప్నాలు పండి..
చిన్నారి ఈ మూర్తివైనావో
ఈరేడు లోకాలు ఏలేవో
ఈరేడు లోకాలు ఏలేవో

ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..
ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఎవరవయ్యా.. ఎవరవయ్యా..

~*~*~*~*~*~*~*~*~*~

పై పాటలో బాల వినాయకుడ్ని చూశారు కదా... ఇపుడు గజముఖుడిని చూడండి... కుమారస్వామి, విఘ్నేశ్వరుడు ఇద్దరూ తమ తండ్రి యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని స్థుతిస్తూ చివరికి విశ్వరూప సందర్శనమిచ్చిన ఆ లయకారుడిని ఎలా ప్రార్ధిస్తున్నారో మీరూ చూసి తరించండి. అందరకూ ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు.. ఈ ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు...



చిత్రం : శ్రీ వినాయక విజయం(1979)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : వీటూరి
గానం : శైలజ, రమేష్
 
ఒక వంక వరనీల కబరీ భరమ్ము
ఒక వంక ఘన జటాజూట భరితమ్ము
ఒక వంక మణి మయోజ్వల కుండలాలు
ఒక వంక భయద పన్నగ భూషణాలు
ఒక కంట కారుణ్య అవలోకనాలు
ఒక కంట విస్ఫులింగ గచ్ఛటాలు
ఒక వంక రమణీయ కాంచనాంబరము
ఒక వంక నిర్వికారము దిగంబరము
ఒక పదమ్మున ప్రణయ నాట్య విన్యాసమ్ము
ఒక పదమ్మున ప్రళయ తండవ విజృంభణము
విశ్వ శ్రేయార్ధకము సృష్టి పరమార్ధమ్ము
శక్తి శివ శక్తుల సంగమ స్వరూపమ్ము
సర్వ రక్షాకరము దుష్ట పీడా హరము
అనశ్వరము శుభకరము అర్ధనారీశ్వరము

శ్రీమన్మహా దేవదేవా ! అమేయ ప్రభావా ! భవా !
భవ్య కారుణ్య భావా ! శివా !
భవానీ ప్రియా ! చిన్మయానంద హృదయా అద్వయా !
దివ్య పంచాక్షరీ వేద మంత్రాలయా ! అవ్వయా !
ప్రకృతీ పురుషులై శక్తియున్ నీవు ఆధార చక్రాన విహరించి 
సంరక్తితో సృష్టి గావించి పాలించవే
సూర్య చంద్రాగ్నులే నీదు నేత్రాలుగా  !
నాల్గు వేదాలు నీ శంఖు నాదాలుగా !
భూమి నీ పాద పీఠమ్ముగా గంగయే నీ శిరో రత్నమ్ముగా 
తేజమే నీకు నీరాజనమ్ముగా 
వాయువే వింజామరమ్ముగా నభము ఛత్రమ్ముగా 
పంచ భూతాలు సతతమ్ము సేవించగా 
సప్తపాదోనిధుల్ సుప్త శైలేంద్రముల్ 
సర్వ లోకాలు తీర్థాలు నీ కుక్షిలో 
సదా ప్రక్షిప్తమై యుండవే !
విశ్వరూపా  ! నమో వేద భువన ప్రదీపా  !
సంతతానంద కేళీకలాపా ! 
జగద్ గీత కీర్తీ  ! లసత్ భూత వర్తీ  !
సదానందమూర్తీ ! నమో దేవతా చక్రవర్తీ 
నమస్తే.. ! నమస్తే.. !! నమః.. !!!       


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.