మంగళవారం, నవంబర్ 22, 2016

ఆలయాన వెలసిన...

దేవత చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవత (1965)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం : వీటూరి
గానం : ఘంటసాల

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

పతిదేవుని మురిపించే వలపుల వీణా
జీవితమే పండించే నవ్వుల వానా
కష్ట సుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ
కష్ట సుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ
మగువేగా మగవానికి మధురభావనా

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగా
సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.