షిర్డీ సాయిబాబా మహత్యం సినిమాలో ఏసుదాస్ గారు అద్భుతంగా గానం చేసిన ఒక మంచి పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీషిర్డి సాయిబాబా మహత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఏసుదాస్
మా పాపాల తొలగించు
దీపాల నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే
నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య
మా పాపాల తొలగించు
దీపాల నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే
నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య
పసిపాప మనసున్న ప్రతిమనిషి లోను
పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్దుడవుతాడని
గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
మమ్ము సాకావు మా సాయి
వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా
పూలన్ని ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
తలపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి
మా పాపాల తొలగించు
దీపాల నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే
నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య
పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం
మిగిలేది ఈ పుణ్యం ఇచ్చు మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి
మరుజన్మ ఇచ్చావయ్య వారి బాధల్ని మోసావయ్య
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో
నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకామాయి నివాసమాయే
ధన్యులమయినామయ్య
మాకు దైవామైవెలిసావయ్య
మా పాపాల తొలగించు
దీపాల నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే
నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య
నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.