శుక్రవారం, నవంబర్ 25, 2016

మనసుల ముడి...

ప్రేమ కానుక చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమ కానుక (1981)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

మనసుల ముడి..పెదవుల తడి
మధువుల ఝడి..ఎద తడబడి
కోటిరాగాలు..పాడే..ఏఏ

తనువులవడి...తపనలసుడి
తలపులసడి..ఎద అలజడి
శతకోటి..రాగాలు..పాడే..ఏఏ

మనసుల ముడి..పెదవుల తడి
మధువుల ఝడి..ఎద తడబడి
కోటిరాగాలు..పాడే..ఏఏ

తనువులవడి... ..తపనలసుడి
తలపులసడి..ఎద అలజడి
శతకోటి..రాగాలు..పాడే..ఏఏ

లతవై నా జతవై..గతస్మృతివై
నా శృతివై..స్వరజతివై..లయగతివై
నను..లాలించవా..ఆ
ఒడివై..చొరవడివై..నా వడివై..
వరవడివై..నా గుడివై..దేవుడవై
నను..పాలించవా..ఆ

వలపు..మెరుపు..మెరిసీ..
మనసు..తలపు..తెరచీ..
సిరిముగ్గులు..వేయించీ..
చిరుదివ్వెలు..వెలిగించీ..
తొలిసారి పలికాను పలుకై..
అది నువ్వే అనుకొన్నా..
నీ నవ్వే వెలుగన్నా
నీవు నాతోడు ఉన్నా..
ఆహాహాహా..నేను నీ నీడనన్నా

మనసుల ముడి..పెదవుల తడి
మధువుల ఝడి..ఎద తడబడి
కోటిరాగాలు..పాడే..ఏఏ

తనువులవడి... ..తపనలసుడి
తలపులసడి..ఎద అలజడి
శతకోటి..రాగాలు..పాడే..ఏఏ

చెలివై..నెచ్చెలివై..చిరుచలివై కౌగిలివై
లోగిలిలో..జాబిలివై..నను మురిపించవా..
వరమై..సుందరమై..శుభకరమై..ఆదరమై
సంబరమై..సాగరమై..నను ముంచేయవా..

కనులు కలిపి చూసీ..కలలు నిజము చేసీ
చిరునవ్వులు నవ్వుంచి..సిరిమువ్వలు మ్రోగించి
తొలిసారి పిలిచాను పిలుపై..

ఆ పిలుపే ఉసిగొలిపి..పరువముతో నను కలిపి
సామగానాలు పాడే..ఆహాహా..సోమపానాలు చేసే

మనసుల ముడి..పెదవుల తడి
మధువుల ఝడి..ఎద తడబడి
కోటిరాగాలు..పాడే..ఏఏ

తనువులవడి ..తపనలసుడి
తలపులసడి..ఎద అలజడి
శతకోటి..రాగాలు..పాడే..
శతకోటి..రాగాలు..పాడే..


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.