మంగళవారం, నవంబర్ 29, 2016

కంటిదీపమల్లే వెలిగే...

మారణహోమం చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ మరియూ ఇక్కడ  చూడవచ్చు.


చిత్రం : మారణహోమం (1987)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

కంటిదీపమల్లే వెలిగే ఇంటికోడలమ్మా
చందనాల పూలకొమ్మ కుందనాల బొమ్మ
కంటిదీపమల్లే వెలిగే ఇంటికోడలమ్మా
చందనాల పూలకొమ్మ కుందనాల బొమ్మ

తల్లి లాంటి మనసు తారలాంటి సొగసు
తల్లి లాంటి మనసు తారలాంటి సొగసు

కళలై వెలిగే కళ్యాణీ
మమకారాలకు మారాణీ
మామకు మనవణ్ణివ్వాలి
ప్రేమకు పెన్నిధి కావాలి

లారిలప్ప లారిలప్ప లారిలప్పలా
అబ్బిగాడు పుట్టగానే ఇన్ని గొప్పలా

లారిలప్ప లారిలప్ప లారిలప్పలా
అబ్బిగాడు పుట్టగానే ఇన్ని గొప్పలా
లారిలప్ప లారిలప్ప లారిలప్పలా
పెంచలేక అమ్మగారికిన్ని తిప్పలా

లారిలప్ప లారిలప్ప లారిలప్పలా
అబ్బిగాడు పుట్టగానే ఇన్ని గొప్పలా
లారిలప్ప లారిలప్ప లారిలప్పలా
పెంచలేక అమ్మగారికిన్ని తిప్పలా

చిన్ని కృష్ణుడల్లే వీడికి ఎన్ని మాయలమ్మా
ఇంతలేడు కానీ అసలే అంతు చిక్కడమ్మా.. 

చిన్ని కృష్ణుడల్లే వీడికి ఎన్ని మాయలమ్మా
ఇంతలేడు కానీ అసలే అంతు చిక్కడమ్మా.. 

మంచి ముత్యమల్లే మంచి గంథమల్లే
మంచి ముత్యమల్లే మంచి గంథమల్లే

మంచి బాలుడై ఎదగాలీ
మచ్చలేని మన జాబిల్లీ
అమ్మకు తృప్తీ అయ్యకి కీర్తి
తేవాలీ మన అబ్బాయి

లారిలప్ప లారిలప్ప లారిలప్పలా
అబ్బిగాడు పుట్టగానే ఇన్ని గొప్పలా

 

5 comments:

naaku chala istamandi venu garu ee song naaku a r rahman vanitha movie lo songs kavali venugaru tamil dubbing movie adi tamil lo movie name karuthamma please ee movie lo songs post cheyandi please venu gaaru

poodota poochindanta and sirimalle moggameedaa two post cheyandi venugaru please

మీరడిగిన రెండు పాటలూ ధనుర్మాసమవగానే వేస్తానండీ.. అంతవరకూ "వనిత" చిత్రంలోని అన్ని పాటలు ఇక్కడ వినవచ్చు వినండి.. https://www.youtube.com/playlist?list=PLlxzWkKHZvMPJpPAEa7PK-v4yyrvz4ugv

this song is written by Sri Veturi

థాంక్సండీ వేటూరి గారు.. పోస్ట్ లో సరిచేశాను..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.