పోలీస్ భార్య చిత్రంలోని ఒక కార్తీక దీపాల పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పోలీస్ భార్య (1990)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం :
గానం :
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కలికి కన్నులలోనా కలల దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కలికి కన్నులలోనా కలల దీపం
కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం
కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం
కోరిన మొగవాడంటే కొండంత దీపం
మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
గౌరీ శివులు లేని కైలాసమేలా
హరిని సిరిని కూడని వైకుంఠమేలా
గౌరీ శివులు లేని కైలాసమేలా
హరిని సిరిని కూడని వైకుంఠమేలా
అలరారే మమతల్లు గుమ్మడి పండు
దోగాడే పాపల్లు దోశపండు
పుణ్యాలు పండించే పూజాదికాలు
మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కలికి కన్నులలోనా కలల దీపం
ఆలూ మగలు లేని ఇల్లంటు ఉందా
రేయి పగలు లేని పొద్దే వుంటుందా
ఆలూ మగలు లేని ఇల్లంటు ఉందా
రేయి పగలు లేని పొద్దే వుంటుందా
దూరానా ఉంటేనే ప్రేమల్లే పొంగు
తీరాలు వేరైతే ఏరైనా పొంగు
సందిట్లో వెలగాలి సంధ్యా దీపాలు
మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం
కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం
కోరిన మొగవాడంటే కొండంత దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కలికి కన్నులలోనా కలల దీపం
మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.