మనసంతా చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మనసంతా (2003)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : శివగణేష్/వెలిదెండ్ల
గానం : రాము/విజయ్ ఏసుదాస్/నారాయణ
మా కంటి పాప మీ ఇంటి దీపమవ్వనీ
మా గుండెలోని ప్రేమ పొంగి దీవెనవ్వనీ
తన నవ్వుల వెన్నెలలో ఈ జగతే మురిసేలే
తన తీయని మాటలలో విరి తేనెలు ఒలికేలే
మా కంటి పాప మీ ఇంటి దీపమవ్వనీ
మా గుండెలోని ప్రేమ పొంగి దీవెనవ్వనీ
మా కంటి పాప మీ ఇంటి దీపమవ్వనీ
మా గుండెలోన ప్రేమ పొంగి దీవెనవ్వనీ
తన నవ్వుల వెన్నెలలో ఈ జగతే మురిసేలే
తన తీయని మాటలలో విరి తేనెలు ఒలికేలే
నిండు నూరేళ్ళు చల్లంగ వర్ధిల్లమ్మా
ఇంటి పేరునె నిలపాలమ్మా
నిండు పున్నమిగ నీ బ్రతుకు సాగాలమ్మా
పూతోటల్లే విరియాలమ్మా
మా కంటి పాప మీ ఇంటి దీపమవ్వనీ
మా గుండెలోని ప్రేమ పొంగి దీవెనవ్వనీ
ఆకాశమంటే ఆనందమే
మా కనులనిండే ఆనంద భాష్పాలులే
మేఘాల మేనా దిగివచ్చెనే
ఊరేగరమ్మని పిలిచింది మీ జంటనే
చల్లగాలి నిను చేరి చెక్కిలినె ముద్దాడి
పూవుల పరిమళం పూసే
వేదిక తానై నిలిచిన పుడమి
కన్నతల్లి లాగ ఎంతో మురిసే
నవ్వులనే ఇవ్వమని
పువ్వులన్నీ వేడుకున్నాయ్
ఆ కోర్కె నువు కాస్త తీర్చాలమ్మా
మా కంటి పాప మీ ఇంటి దీపమవ్వనీ
మా గుండెలోని ప్రేమ పొంగి దీవెనవ్వనీ
ఆ బాపు బొమ్మ సుగుణాల కొమ్మ
మా ఇంటిలోని మహలక్ష్మి నీవేనులే
చిరుగాలి తూగే చిగురాకువమ్మా
ఈ అన్న కన్నుల కదిలేటి హరివిల్లువే
మెట్టినిల్లే ఇక నీకు పుట్టిల్లు తల్లి
అత్తగారే ఇక నీకు తల్లీ
భర్తమాట దాటబోకు రతనాల వల్లీ
శ్రీరామచంద్రుడంటే అతనే
నలుగురిలో నవ్వకమ్మా చాడీలు చెప్పకమ్మా
అందరితో అణకువగా ఉండాలమ్మా
మా కంటి పాప మీ ఇంటి దీపమవ్వనీ
మా గుండెలోన ప్రేమ పొంగి దీవెనవ్వనీ
తన నవ్వుల వెన్నెలలో ఈ జగతే మురిసేలే
తన తీయని మాటలలో విరి తేనెలు ఒలికేలే
నిండు నూరేళ్ళు చల్లంగ వర్ధిల్లమ్మా
ఇంటి పేరునె నిలపాలమ్మా
నిండు పున్నమిగ నీ బ్రతుకు సాగాలమ్మా
పూతోటల్లే విరియాలమ్మా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.