గురువారం, నవంబర్ 17, 2016

కంటికి నువ్వే దీపం..

యమకింకరుడు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : యమకింకరుడు (1982)
సంగీతం : చంద్రశేఖర్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, ఏసుదాస్, సుశీల, కోరస్

కంటికి నువ్వే దీపం..
ఒహోం ఒహోం హొ ఒహోం ఒహో
కలలకు నువ్వే రూపం
ఒహోం ఒహోం హొ ఒహోం ఒహోం
ముగ్గురి ముద్దుల కోసం
ఒహోం ఒహోం హొయ్ ఒహోం ఒహో
ఊయలలూగే పాశం
ఒహోం ఒహోం హొయ్ ఒహోం ఒహో
హాయి పాపాయి.. హాయి పాపాయి...

ఆరని దివ్వెల నవ్వు వాడని మల్లెల నవ్వు
మా నవ్వుల ప్రాణం నువ్వూ నూరేళ్ళు నవ్వు
అల్లుడి కట్నం ఇవ్వు ఆ.. పిల్లని కని మాకివ్వు
మామవు ఐతే నువ్వూ మా బాబు నవ్వూ
ముద్దుల బాబూ పెళ్ళికీ నేనే ముత్యాల పల్లకీ
నేనే నేనే ముత్యాల పల్లకీ..

ఒహోం ఒహోం హొ ఒహోం ఒహోం
కంటికి నువ్వే దీపం..
ఒహోం ఒహోం హొ ఒహోం ఒహోం
కలలకు నువ్వే రూపం
ఒహోం ఒహోం హొ ఒహోం ఒహోం
హాయి పాపాయి.. హాయి పాపాయి..

సూర్యుడు చూడని గంగా చూపులలో కరగంగా
నీ లాలలు పోసే తల్లి గారాల చెల్లి
దేవుడికందని ప్రేమా అమ్మని మించిన ప్రేమా
ఆ పెన్నిధి పేరే మామ నీ మేనమామ
మళ్ళీ వచ్చే జన్మకి బొమ్మై పుడతా ఆటకీ
నేనే నేనే బొమ్మై పుడతా ఆటకీ

ఒహోం ఒహోం హొ ఒహోం ఒహోం
కంటికి నువ్వే దీపం..
ఒహోం ఒహోం హొ ఒహోం ఒహోం
కలలకు నువ్వే రూపం
ఒహోం ఒహోం హొ ఒహోం ఒహోం
ముగ్గురి ముద్దుల కోసం 
ఒహోం ఒహోం హొయ్ ఒహోం ఒహో
ఊయలలూగే పాశం
ఒహోం ఒహోం హొయ్ ఒహోం ఒహో
హాయి పాపాయి.. హాయి పాపాయి...


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.