బుధవారం, నవంబర్ 02, 2016

వెలిగింది నా ప్రాణదీపం...

గౌతమి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.

 
చిత్రం : గౌతమి (1987)
సంగీతం : బాలు
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, సుశీల

చీకటి కాటుక కాగల చెంపల వాకిట
వ్రాసిన కన్నీటి అమవాసలో
చిగురాశల వేకువరేఖల కెంపుల ముగ్గులు
వేసిన నీ చూపు కిరణాలలో

వెలిగింది నా ప్రాణదీపం
ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం
మది నీకు నీరాజనం
ప్రతి అణువు పూలహరం
వెలిగింది నా ప్రాణదీపం
ఈ జన్మంత నీ పూజకోసం

నలుపైన మేఘాలలోనే ఇల నిలిపేటి జలధారలేదా
నలుపైన మేఘాలలోనే ఇల నిలిపేటి జలధారలేదా
వసివాడు అందాలకన్నా నీ సుగుణాల సిరి నాకు మిన్న
వసివాడు అందాలకన్నా నీ సుగుణాల సిరి నాకు మిన్న
తీయని ఊహలతీరము చేరువ చేసిన స్నేహము
ఏనాటి సౌభాగ్యమో

వెలిగింది నా ప్రాణదీపం
ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం
మది నీకు నీరాజనం
ప్రతి అణువు పూలహరం
వెలిగింది నా ప్రాణదీపం
ఈ జన్మంత నీ పూజకోసం

నూరేళ్ళ బ్రతుకీయమంటు ఆ దైవాన్ని నే కోరుకుంటా
నూరేళ్ళ బ్రతుకీయమంటు ఆ దైవాన్ని నే కోరుకుంటా
ప్రతిరోజు విరిమాలచేసి నీ పాదాల అర్పించుకుంటా
ప్రతిరోజు విరిమాలచేసి నీ పాదాల అర్పించుకుంటా
మాయని మమతల తావులు నిండిన జీవనవాహిని
ప్రతిరోజు మధుమాసమే

వెలిగింది నా ప్రాణదీపం
ఈ జన్మంత నీ పూజకోసం
నీ నీడ దేవాలయం
మది నీకు నీరాజనం
ప్రతి అణువు పూలహరం
వెలిగింది నా ప్రాణదీపం
ఈ జన్మంత నీ పూజకోసం

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.