కార్తీక మాసం సంధర్బంగా ఈ నెల రోజులు దీపాల పాటలు తలచుకుందాం. మొదట గోరంత దీపం చిత్రం నుండి టైటిల్ సాంగ్.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : గోరంత దీపం (1978)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, పి.సుశీల
గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..
గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..
కరిమబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగూ..
కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు..
కరిమబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగూ..
కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు..
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు..
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు..
దహియించే బాధల మద్యన సహనమే వెలుగు!!
ఆహాఆఆఆఆ ఆఆఆఆఅ
గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..
కడలి నడుమ పడవ మునిగితే..కడదాకా ఈదాలి..
కడలి నడుమ పడవ మునిగితే..కడదాకా ఈదాలి..
నీళ్ళు లేని ఎడారిలో..ఓఓఓఓఓఓ
నీళ్ళు లేని ఎడారిలో.. కన్నీళ్ళైనా తాగి బతకాలి..
నీళ్ళు లేని ఎడారిలో.. కన్నీళ్ళైనా తాగి బతకాలి..
ఏ తోడు లేని నాడు..నీ నీడే నీకు తోడు!!
ఏ తోడు లేని నాడు..నీ నీడే నీకు తోడు!!
జగమంతా దగాచేసినా..
చిగురంత ఆశను చూడు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..
గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.