నాగుల చవితి సంధర్బంగా దేవి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : దేవి (1999)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : స్వర్ణలత
వేయి పడగల నీడలో రేయి పగలు
జగములన్నియు కాపాడు జనని నీవు
లోక కళ్యాణ కారిణి... శ్రీకరి...
ఇల సకల జనులకు ఒసగవే
శాంతి సుఖము
నాలుగు వేదములే నీ పుట్టకు
ద్వారములై విలసిల్లగా
పదునాలుగు లోకాల నివాసులు
నాగుల చవితికి నిన్నే కొలువగా
భక్తి భావమున కరిగిన హృదయం
పాలధారగా మారగా
భక్తి భావమున కరిగిన హృదయం
పాలధారగా మారగా
అర్చన చేయుచు హారతి నీయగ
గైకొన రావే దేవీ
దేవీ నాగదేవీ దేవీ నాగదేవీ
దేవీ నాగదేవీ దేవీ నాగదేవీ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.