బుధవారం, నవంబర్ 16, 2016

సుడిగాలిలోన దీపం...

ఆనందభైరవి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆనందభైరవి (1984)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, శైలజ 

సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం 
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం 
ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయ ఓఓఓ..
ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయ

సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం 
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం 
దయచూపి కాపాడు దైవరాయ ఓఓఓ..
దయచూపి కాపాడు దైవరాయ

మట్టిమీద పుట్టేనాడూ మట్టిలోన కలిసేనాడూ 
మట్టిమీద పుట్టేనాడూ మట్టిలోన కలిసేనాడూ 
పొట్ట శాత పట్టందే ఓరయ్యో... 
గిట్టుబాటు కాదీ బతుకు ఇనరయ్యో..
గిట్టుబాటు కాదీ బతుకు ఇనరయ్యో..

సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం 
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం 
దయచూపి కాపాడు దైవరాయ ఓఓఓ..
దయచూపి కాపాడు దైవరాయ

గుడ్డు కన్ను దెరిసే నాడూ రెక్కలొచ్చి ఎగిరేనాడూ..
గుడ్డు కన్ను దెరిసే నాడూ రెక్కలొచ్చి ఎగిరేనాడూ..
జోలెపట్టి అడగందే ఓలమ్మో... 
కత్తిమీద సామీ బతుకు ఇనవమ్మో..
కత్తిమీద సామీ బతుకు ఇనవమ్మో..

సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం 
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం 
ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయ ఓఓఓ..
ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయ

సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం 
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం 
దయచూపి కాపాడు దైవరాయ ఓఓఓ..
దయచూపి కాపాడు దైవరాయ

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.