ముద్దమందారం చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ముద్దమందారం (1981)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, ఎస్ జానకి
శ్రీరస్తూ శుభమస్తూ కళ్యాణమస్తూ
జీవేమ శరదాం శతం భవామ శరదాం శతం
నందామ శారదాం శతం చిరంజీవా సుఖీభవా
శతాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ
కడగంటి కొలకుల్లో తెలుగింటి వెలుగుల్లు
తెర తీసిన తేనెదీపం తేనె కన్న తీపి రూపం
తేనె కన్న తీపి రూపం
నీ నిండు హృదయాన ఒదిగేటి సమయాన
ప్రణయాల ఓంకార నాదం వినిపించె కళ్యాణ గీతం
వినిపించె కళ్యాణ గీతం
హరిత వర్ణ చైత్ర పత్ర గీతికలా
గ్రీష్మ తప్త ఉదయ రాగ కుంకుమలా
గగన నీల శ్రవణ మేఘ మాలికలా
శరత్కాల సితానంద చంద్రికలా కదలిరా
కప్పుర తీవల వీణలు వెన్నెల పుప్పొడి వానలు
అందాలభరిణ అనురాగకిరణ
అందాలభరిణ అనురాగకిరణ
కనుపాపలే మూగజాణలు
ఈ చంచల నాయన బృగంచల రేఖా
చందన శీతల శీకరములు వశీకరములు
నీ మేఘసందేశమే నీ మోహనావేశమే
నీ దాహ సంకీర్తనే నీ దాహ సంకేతమే
కడగంటి కొలకుల్లో తెలుగింటి వెలుగుల్లు
తెర తీసిన తేనెదీపం తేనె కన్న తీపి రూపం
తేనె కన్న తీపి రూపం
హిమస్నపిత హేమ పుష్పలా వికలా
శిశిర శీర్ణ జీర్ణ పత్ర భూమికలా
సాంఝ రాగ పశ్చిమాంతరంగిణిలా
సప్త వర్ణ స్వరస స్వర్ణ సుందరిలా
ఇంద్ర ధనుస్సుందరిలా తరలిరా
నాపాలి వేదాద్రి శిఖరం నా ఇల్లు నీదివ్య చరణం
చుంబించు అధరం సుధ కన్న మధురం
చుంబించు అధరం సుధ కన్న మధురం
నీ మాట మంత్రాక్షరం
తమాల పల్లవ జాల మాలికా
వికసిత విభాత భాస్వంతము నాస్వాంతము,
నీ స్నేహ సంగీతమే నీ స్నిగ్ధ సౌందర్యమే
నీ సాంఝ సంసారమే నీ సాంఝ సంసారమే
కడగంటి కొలకుల్లో తెలుగింటి వెలుగుల్లు
తెర తీసిన తేనెదీపం తేనె కన్న తీపి రూపం
తేనె కన్న తీపి రూపం
నీ నిండు హృదయాన ఒదిగేటి సమయాన
ప్రణయాల ఓంకార నాదం వినిపించె కళ్యాణ గీతం
వినిపించె కళ్యాణ గీతం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.