రాజ్ సీతారాం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాజ్ సీతారాం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, జులై 23, 2020

ఆకాశంలో ఒక తారా...

సింహాసనం చిత్రంలోని ఆకాశంలో ఒక తార పాటను సీమటపాకాయ్ సినిమా కోసం రీమిక్స్ చేశారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సీమటపాకాయ్ (2012)
సంగీతం : బప్పీలహరి
రీమిక్స్ : వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం : వేటూరి
గానం : జావేద్ అలీ, శ్రావణ భార్గవి   

ఇక మొట్ట మొదటి సెవెంటీ ఎమ్మెమ్ సినిమా స్కోప్ చిత్రంమనే క్రెడిట్ కొట్టేయడమే కాక అప్పట్లో బాహుబలి అనదగ్గ భారీ బడ్జెట్ అండ్ తారాగణంతో తెరకెక్కిన సింహాసనం సినిమాలోని ఒరిజినల్ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సింహాసనం (1986)
సంగీతం : బప్పీలహరి
సాహిత్యం : వేటూరి 
గానం : రాజ్ సీతారామ్, సుశీల 

జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం 
హే...హేహే..ఆ..ఆ...ఆహహా... లాలల లలలా ఆ...అ... 

ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ
ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ

ఇలలో ఒక చందమామ... ఒడిలో పొంగింది ప్రేమ
ఇలలో ఒక చందమామ... ఒడిలో పొంగింది ప్రేమ

తార జాబిలి కలవని నాడు... ఏ వెన్నెలా లేదులే
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం 
ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ

ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం 
ఎన్నాళ్లో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన

అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు
అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు

వాగు వంక కలవని నాడు ఏ వెల్లువ రాదులే

జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం 
ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ 

కాలంతో ఈ బంధం ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం 

కాలంతో ఈ బంధం ఈడల్లె పెంచింది నన్ను
అల్లుకోనా నీతోడై నీ లేత కౌగిళ్ళలోన

నీవే నా రాచపదవి... నీవే నా ప్రణయరాణివి
నీవే నా రాచపదవి... నీవే నా ప్రణయరాణివి

నీవు నేను కలవకపోతే ప్రేమన్నదే లేదులే

జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం 
ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ
తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే

అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోన
అందుకోనా లేతవలపే నీ ముద్దుముంగిళ్ళలోన

అనురాగం అందంగా మెరిసింది నీ కళ్ళలోన
అందుకో నా లేతవలపే నీ ముద్దుముంగిళ్ళలోన

కదిలే నీ ప్రాణశిల్పం... మదిలో కర్పూరదీపం
కదిలే నీ ప్రాణశిల్పం... మదిలో కర్పూరదీపం

నింగి నేల కలిసినచోట... ఏ వెలుతురూ రాదులే

జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం 
ఆకాశంలో ఒక తారా... నాకోసమొచ్చింది ఈ వేళ
తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే

జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం 
జుం తరజుం జుం తనజుం జుం తరజుం జుం తనజుం 


బుధవారం, డిసెంబర్ 03, 2014

ఏలా ఇంత దూరం...

జమదగ్ని సినిమా కోసం ఇళయరాజా గారి స్వరకల్పనతో వచ్చిన ఓ చక్కని పాటను ఈరోజు తలచుకుందామా.. ఈ పాట తాలూకూ వీడియో నాకు దొరకలేదు. రాజ్ సీతారాం తన కెరీర్ అంతా కృష్ణ గారికి మాత్రమే పాడినట్లున్నారు అతని స్వరం వినగానే నాకు కృష్ణ గారి స్టెప్పులే గుర్తొస్తుంటాయి. మంచి సంగీత సాహిత్యాల మేళవింపైన ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.   


చిత్రం : జమదగ్ని (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : రాజ్ సీతారాం, జానకి

ఏలా ఇంత దూరం నీవే నాకు ప్రాణం 
ఏలా ఇంత దూరం నీవే నాకు ప్రాణం
వేర్ ఆర్ యూనౌ యు టెల్ మీ నౌ
వేర్ ఆర్ యూనౌ యు లవ్ మీ నౌ
వేర్ ఆర్ యూనౌ
ఏలా ఇంత దూరం నీవే నాకు ప్రాణం 

చేమంతి పూదోటలో సాగే హేమంత రాగానివై
లేమంచు కవ్వింతలే రేగే నా ప్రేమ గీతిలా
దోసిళ్లలోని ఆశలన్నీ కౌగిళ్ల పూసి రాలిపోయె
నీకళ్ళలోని ఊసులన్ని నా పెళ్ళినాటి బాసలాయె 
పారాణిలా పదాలే తాకీ.. రేరాణిలా సుఖాలే పూసీ..
నీ పైటతో పదాలే రాసి ఆ పాటలో స్వరాలే పోసీ
ముద్దాడుకున్నాయి లే ప్రేమ క్రీనీడలై.. 

వేర్ ఆర్ యూనౌ యు టెల్ మీ నౌ
వేర్ ఆర్ యూనౌ యు టెల్ మీ నౌ
వేర్ ఆర్ యూనౌ

వేసంగి నిట్టూర్పులో ఏదో సన్నాయి పాడిందిలే 
ఆషాఢ నీరెండలో పూసే సంపెంగ పూలతో
ఆకాశమంత పందిరేసి భూదేవిలాగ వాలిపోయి 
అక్షింతలంటి తారలన్ని ఆనాటిదాక రాకపోయి 
నీ కళ్ళలో నిషానే తీసి కౌగిళ్ళనే హుషారే చేసి 
సంకెళ్ళతో సరాగాలాడి కన్నీళ్లతో వసంతాలాడి 
చెల్లించుకుందాములే చేసినా బాసలే.. 

వేర్ ఆర్ యూనౌ యూ ఆర్ మై లవ్
వేర్ ఆర్ యూనౌ యూ ఆర్ మై లవ్ 
వేర్ ఆర్ యూనౌ
ఏలా ఇంత దూరం నీవే నాకు ప్రాణం 
ఏలా ఇంత దూరం నీవే నాకు ప్రాణం

శుక్రవారం, సెప్టెంబర్ 05, 2014

జీవన వేణువు పాడెను...

మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ సినిమా నాకు లీలగా గుర్తుంది. ఇందులో జయప్రద ముందుగా టామ్ బోయ్ గెటప్ తో పరిచయమై తరువాత మాములు గెటప్ లో కనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది తను ఈ సినిమాలో. కానీ ఈ పాట తాలూకు వీడియో ఎక్కడా దొరకలేదు మీకు తెలిస్తే కామెంట్స్ లో పంచుకోండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సూర్యచంద్ర (1985) 
సంగీతం : రమేష్ నాయుడు 
సాహిత్యం : వేటూరి 
గానం : రాజ్ సీతారాం, సుశీల

జీవన వేణువు పాడెను ఏమనీ ఏమేమనీ.. 
నవ జీవన గీతికి పల్లవి నీవనీ నీ ప్రేమనీ..
సాగనీ ప్రియరంజనీ పూజనీ నీ పూజనీ..

జీవన వేణువు పాడెను ఏమనీ ఏమేమనీ.. 
నవ జీవన గీతికి పల్లవి నీవనీ నీ ప్రేమనీ..
సాగనీ ప్రియరంజనీ పూజనీ నీ పూజనీ..

ఈ ప్రణయాలూ అభిమానాలూ దాచాలంటే దాగనివేలే..
సూర్యుడు నీవై చూసే వేళ ఎదలో పద్మం విరిసెనులే..
ఆఆఅ...ఆఅహాహహాఅ....ఆఆఆహాహ్హాఅ...
చంద్రుడు నీవై పిలిచే వేళ నాలో తారక మెరిసెనులే..

జీవన వేణువు పాడెను ఏమనీ ఏమేమనీ.. 
నవ జీవన గీతికి పల్లవి నీవనీ నీ ప్రేమనీ..
సాగనీ ప్రియరంజనీ పూజనీ నీ పూజనీ..

నీ చిరునవ్వే నా సిగపూలై ప్రేమ సుగంధం చల్లెను నాలో.. 
కన్నుల మెరిసే కాటుక లేఖ వివరాలన్నీ తెలిసెనులే.. 
ఆఆఅ...ఆఅహాహహాఅ....ఆఆఆహాహ్హాఅ...
కౌగిలి గుడిలో కన్నెతనాలా కళ్యాణాలే జరిగెనులే.. 

జీవన వేణువు పాడెను ఏమనీ ఏమేమనీ.. 
నవ జీవన గీతికి పల్లవి నీవనీ నీ ప్రేమనీ..
సాగనీ ప్రియరంజనీ పూజనీ నీ పూజనీ..

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.