శుక్రవారం, సెప్టెంబర్ 05, 2014

జీవన వేణువు పాడెను...

మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ సినిమా నాకు లీలగా గుర్తుంది. ఇందులో జయప్రద ముందుగా టామ్ బోయ్ గెటప్ తో పరిచయమై తరువాత మాములు గెటప్ లో కనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది తను ఈ సినిమాలో. కానీ ఈ పాట తాలూకు వీడియో ఎక్కడా దొరకలేదు మీకు తెలిస్తే కామెంట్స్ లో పంచుకోండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సూర్యచంద్ర (1985) 
సంగీతం : రమేష్ నాయుడు 
సాహిత్యం : వేటూరి 
గానం : రాజ్ సీతారాం, సుశీల

జీవన వేణువు పాడెను ఏమనీ ఏమేమనీ.. 
నవ జీవన గీతికి పల్లవి నీవనీ నీ ప్రేమనీ..
సాగనీ ప్రియరంజనీ పూజనీ నీ పూజనీ..

జీవన వేణువు పాడెను ఏమనీ ఏమేమనీ.. 
నవ జీవన గీతికి పల్లవి నీవనీ నీ ప్రేమనీ..
సాగనీ ప్రియరంజనీ పూజనీ నీ పూజనీ..

ఈ ప్రణయాలూ అభిమానాలూ దాచాలంటే దాగనివేలే..
సూర్యుడు నీవై చూసే వేళ ఎదలో పద్మం విరిసెనులే..
ఆఆఅ...ఆఅహాహహాఅ....ఆఆఆహాహ్హాఅ...
చంద్రుడు నీవై పిలిచే వేళ నాలో తారక మెరిసెనులే..

జీవన వేణువు పాడెను ఏమనీ ఏమేమనీ.. 
నవ జీవన గీతికి పల్లవి నీవనీ నీ ప్రేమనీ..
సాగనీ ప్రియరంజనీ పూజనీ నీ పూజనీ..

నీ చిరునవ్వే నా సిగపూలై ప్రేమ సుగంధం చల్లెను నాలో.. 
కన్నుల మెరిసే కాటుక లేఖ వివరాలన్నీ తెలిసెనులే.. 
ఆఆఅ...ఆఅహాహహాఅ....ఆఆఆహాహ్హాఅ...
కౌగిలి గుడిలో కన్నెతనాలా కళ్యాణాలే జరిగెనులే.. 

జీవన వేణువు పాడెను ఏమనీ ఏమేమనీ.. 
నవ జీవన గీతికి పల్లవి నీవనీ నీ ప్రేమనీ..
సాగనీ ప్రియరంజనీ పూజనీ నీ పూజనీ..

2 comments:

చిట్టరెడ్డి సూర్యకుమారి గారు రాసిన సూర్యచంద్ర నవల ఇది..అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు చేసినా కధ యేమాత్రం డీవియేట్ కాకుండా తీశారు..ఇక జయప్రద గురించి యెంత చెప్పినా తక్కువే.."అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ" అన్న వాక్యాలు టూమచ్ గా గుర్తొచ్చేస్తాయండి..

థాంక్స్ శాంతి గారు.. అవునండీ జయప్రద గారి గురించి కరెక్ట్ గా చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.