శుక్రవారం, సెప్టెంబర్ 26, 2014

దేవీ త్రిభువనేశ్వరీ...

ఈరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తారు. చిత్రాన్నము లేదా పులిహోర నైవేద్యముగా సమర్పించి పూజించుకునే రోజు. ఈసందర్బంగా మధురమీనాక్షి చిత్రంలోని దేవీ త్రిభువనేశ్వరి అనే ఈ పాటను తలచుకొందామా. ఊయలలో ఉన్న బాలని సాక్షత్ లక్ష్మీ సరస్వతులు ఆటపాటలతో అభివర్ణించే అపురూపమైన ఘట్టమిది. ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : మధురమీనాక్షి (1989)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాధన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : వాణీజయరాం

దేవీ త్రిభువనేశ్వరీ
దేవీ త్రిభువనేశ్వరీ 
గౌరీ శ్రీ రాజ రాజేశ్వరీ..
మధురాపురి విభుని
మనసున మురిపించ
మహి వెలసిన తల్లివే
నీవు మణిమయ తేజానివే... 
దేవీ త్రిభువనేశ్వరీ
గౌరీ శ్రీ రాజ రాజేశ్వరీ..
శ్రీ రాజ రాజేశ్వరీ..

చిరునవ్వు భువికెల్ల ఆనందమే..
చిందించు కరుణార్ధ్ర మకరందమే
చిరునవ్వు భువికెల్ల ఆనందమే
చిందించు కరుణార్ధ్ర మకరందమే
చరితార్ధులను చేయు నీ చరణమే
సకలార్ద విజ్ఞాన సందోహమే... 

దేవీ త్రిభువనేశ్వరీ
గౌరీ శ్రీ రాజ రాజేశ్వరీ..
శ్రీ రాజ రాజేశ్వరీ..

భక్త తతికెల్ల శక్తివై నిలుచు ముక్తి దాత నీవే
తక్క తకధీంత తక్క తకఝంత తకట తఝుణు తకతా
నీ దర్శన భాగ్యానికి కాచేనట వేచేనట ఈ జగమే 
తద్దింతక తఝ్ఝుంతక తద్దింతక తఝ్ఝుంతక తకఝణుతా 
పరాకేల జగన్మాత దిగంతాల మొరాలించు దేవతవే 
తఝంతంత తఝంతంత తఝంతంత తఝంతంత తకధిమిత 
నీతి నిలుపుటకు కూర్మి నెరపుటకు పృథివిపై నీవు వెలసితివే 
తకిట తకధీంత తకిట తకధీంత తకిట తకధీంత తకఝణుత 
దేవీ మాతా జగతీ నేతా కల్పకవల్లి 
తకఝం తఝణం తకఝం తఝణం తరికిటతోం తరికిటతోం 
ముద్దులు చిందే ముచ్చటలొలికే మోహన రూపిణి సుహాసిని 
తాంతక ధీంతక తోంతక నంతక తాంతక ధీంతక తధింతత 
నీ పద యుగములు నమ్మిన వారికి ఆశ్రయమీయవె విలాసిని 
తకధిమి తకఝణు తకధిమి తకఝణు తకధిమి తకఝణు తధీంతత 
తద్ధీంతరికిట తద్ధీంతరికిట తద్ధీంతరికిట తద్ధీంతరికిట  
తద్ధీంతరికిట తద్ధీంతరికిట తద్ధీంతరికిట తద్ధీంతరికిట
చూపులు మోహనం నగమే చందనం 
అభయం జగతికే.. 
 
దేవీ త్రిభువనేశ్వరీ
గౌరీ శ్రీ రాజ రాజేశ్వరీ..
శ్రీ రాజ రాజేశ్వరీ..

2 comments:

సాక్షాత్ లక్ష్మీ, సరస్వతి అమ్మవారిని గురించి వర్ణించడం..అదీ మా ఫావరెట్ సింగర్ వాణీజయరాం గారి వాయిస్ లో..అద్భుతంగా వుందండీ..

ధన్యవాదాలు శాంతి గారు... అవునండీ నిజంగా అద్భుతమైన పాట.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.