ఆదివారం, సెప్టెంబర్ 21, 2014

గుడిగంటలా నవ్వుతావేలా...

ఆర్పీ పట్నాయక్ చేసిన మెలోడీలలో ఒక మంచి పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
రచన : కులశేఖర్
గానం : ఎస్.పి.బి.చరణ్ , ఉష

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు

నీవైపలా చూస్తుంటె ఆకలేయకుంది
నీ చూపులొ బంధించె మంత్రమె ఉన్నది
నీ మాటలె వింటుంటె రోజు మారుతుంది
నా తోడుగ నువ్వుంటె స్వర్గమె చిన్నది
మనసెందుకొ ఇలా మూగబోతోంది రామ
తెలియదు
మరుమల్లె పువ్వుల గుప్పుమంటోంది లోన
తెలియదు

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు

నీ నీడలొ నేనున్నా చూడమంటున్నది
ఈ హాయి పేరేదైన కొత్తగా ఉన్నది
నా కంటినే కాదన్న నిన్ను చూస్తున్నది
నేనెంతగా వద్దన్నా ఇష్టమంటున్నది
మరి దీనినేకద లోకమంటుంది ప్రేమా
తెలియదు
అది దూరమంటూనె చేరువౌతుంది రామ
తెలియదు

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు నాకు తెలియదు
అసలేంటి సంగతి ఓ బాలా
తెలియదు తెలియదు తెలియదు తెలియదులే

గుడిగంటలా నవ్వుతావేలా
తెలియదు నాకు తెలియదు
జడగంటలా ఊగుతావేలా
తెలియదు

2 comments:

ఆర్ పి అప్పుడప్పుడూ పాడుతూ మ్యూజిక్ మీద యెక్కువగా కాన్సంట్రేట్ చేసి ఉంటే బావుండేదేమో వేణూజీ..

హహహ బాగా చెప్పారు శాంతి గారు... ప్రతిపాట తనే పాడాలనుకోకుండా కొన్నే పాడితే మరింత బాగుండేది. అలాగే దర్శకత్వం వైపు వెళ్ళకపోతే మరికొన్ని మంచి మెలోడీస్ అందించగలిగేవారని నేను ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.