మంగళవారం, సెప్టెంబర్ 02, 2014

గంధపు గాలిని...

శంకర్ మహదేవన్ కొన్ని పాటలను పాడిన విధానం చాలా బాగుంటుంది. ఇతనే పాడాలి ఈ పాట అని అనిపిస్తాడు. అలాంటి ఓ పాట ఈ గంధపు గాలిని పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ప్రియురాలు పిలిచింది(2000)
సంగీతం : A.R.రెహమాన్
సాహిత్యం : AM.రత్నం, శివగణేష్
గానం : శంకర్ మహదేవన్

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప 
ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే 

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
 
గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప 
ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
 
హృదయమొక అద్దమని నీ రూపు బింబమని
తెలిపేను హృదయం నీకు సొంతమనీ....
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి
అద్దాల ఊయల బింబమూగె చెలీ....
నువు తేల్చి చెప్పవే పిల్లా
లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో
వెంటాడి ఇక వేటాడొద్దే

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా
 
తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేది
వాసనలు వీచే నీ కురులే సఖీ....
లోకాన చీకటైనా వెలుగున్న చోటేది
సూరీడు మెచ్చే నీ కనులే చెలీ....
విశ్వ సుందరీమణులె వచ్చి
నీ పాద పూజ చేస్తారే
నా ప్రియ సఖియా ఇక భయమేలా
నా మనసెరిగి నా తోడుగ రావే

ఏమి చేయమందువే ఏమి చేయమందువే
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
న్యాయమా... న్యాయమా
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
మౌనమా... మౌనమా
ఏమి చేయమందువే
 

2 comments:

నైస్ సాంగ్..ఇందులోదే 'యేమాయె నా కవిత ' పాట పోస్ట్ చెయ్యగలరా..

అలాగేనండీ శాంతి గారు త్వరలో పోస్ట్ చేస్తాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.