ఈ బ్లాగులో తరచుగా నాకు రేడియో పరిచయం చేసిన పాటలంటూ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, అలాగే ఈ పాట నాకు టీవీ పరిచయం చేసిన పాట. టీవీ అంటే దూరదర్శన్ ఛానల్స్ మాత్రమే అందుబాటులో ఉన్న తొలిరోజుల్లో ప్రతి గురువారం రాత్రి ఎనిమిదింటికి చిత్రలహరి ప్రోగ్రాం వచ్చేది అందులో ఈ పాట కొంతకాలం రెగ్యులర్ గా వచ్చేది. మొదటిసారి అక్కడ చూసే అభిమానించాను. నాకు నచ్చిన ఈ మెలోడీని మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : విజేతలు (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, జానకి
ఉండాలీ నీ గుండెల్లో.. నేనే నీవుగా
నిండాలీ నీ కళ్ళల్లో.. వెలుగే నేనుగా
చిగురాశలే ఊరించనా
సిరి తేనెలే ఒలికించనా
రాగాలు నే పంచనా
నిండాలీ నీ కళ్ళల్లో.. వెలుగే నేనుగా
పూలగంధాలు పలికేను నేడు ముద్దు మురిపాలనే
పసిడి చిరుగాలి కెరటాలు చూడు కలలు ఊరించెనే
సందె వెలుగుల్లో నయనాలు నేడు సుధలు చిలికించవా
రాగతీరాల దరిచేరి కదిలే ఎదలు పులకించవా
ఏవేవో ఆశలు పూచే ఏకాంతా వేళా
గారాలా బంధాలన్ని కదిలేటీ వేళా
వంత పాడిందీ ప్రేమ బంధం
లేదంట ఈ సాటి యోగం
ఉండాలీ నీ గుండెల్లో నేనే నీవుగా
జన్మ జన్మాల నా తోడు నీడై నీవు ఉండాలిలే
చెలికి నీ చెలిమి కావాలి చూడు నీవు నా ఊపిరే
నింగి ఈ నేల స్థితి మారుతున్నా స్నేహమే మారునా
కాలగతులన్ని మారేను గాని హృదయమే మారునా
ఉంటానూ నీతో నేను నీ తలపే వేదం
నాదేలే నీలో సర్వం నీ పిలుపే నాదం
మనదిలే ఇంక ప్రేమ లోకం
ఇది కాదె రాగానురాగం
ఉండాలీ నీ గుండెల్లో.. నేనే నీవుగా
నిండాలీ నీ కళ్ళల్లో.. వెలుగే నేనుగా
చిగురాశలే ఊరించనా
సిరి తేనెలే ఒలికించనా
రాగాలు నే పంచనా
ఉండాలీ నీ గుండెల్లో.. నేనే నీవుగా
2 comments:
అమల..వన్ ఆఫ్ మై ఫేవరేట్స్ వేణూజీ..
థాంక్స్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.