జీవన తీరాలు సినిమా కోసం చక్రవర్తి గారి స్వరకల్పనలో సినారె గారి రచించిన ఈ పాట నాకు చాలా ఇష్టం. మీరూ ఈ పాట విని ఆనందించండి. యూట్యూబ్ యాక్సెస్ లేనివారు ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : జీవన తీరాలు (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : బాలు, సుశీల
కెరటానికి ఆరాటం.. తీరం చేరాలని..
తీరానికి ఉబలాటం.. ఆ కెరటం కావాలని..
కెరటానికి ఆరాటం.. తీరం చేరాలని..
తీరానికి ఉబలాటం.. ఆ కెరటం కావాలని..
ఎందుకో ఈ ఆరాటం.. అందుకే...
అందుకే.. ఆ ఉబలాటం
కెరటానికి ఆరాటం.. తీరం చేరాలని..
కురులపై మెరిసే చినుకులు.. ఆణిముత్యాలై
తనువుపై కురిసే చినుకులు.. తడితడి ముచ్చటలై
మది లోపలి తెర తీసి... మారాము చేస్తుంటే...
మది లోపలి తెర తీసి... మారాము చేస్తుంటే...
పదునైన కోరిక ఏదో పెదవినే గురి చూస్తుంది..
ఎందుకో ఈ ఆరాటం.. అందుకే...
అందుకే.. ఆ ఉబలాటం
ఏమి వెన్నెల ఎంతకూ మన ఇద్దరి పైనే పడుతున్నది
తనకు దాహం వేసిందేమో.. మనలనల్లరి పెడుతున్నది
ఎంతెంత దగ్గరగా...ఆ... ఇద్దరమూ ఉన్నా...
మరికాస్తా... ఇంకాస్తా.. ఒదిగిపొమ్మని...
మౌనంగా ఉరుముతున్నది... వెన్నెల ఉరుముతున్నది
ఎందుకో ఈ ఆరాటం.. అందుకే...
అందుకే.. ఆ ఉబలాటం
సరిసా...ఆఆ...
ఇది వసంతమని తెలుసు.. కోయిల పాటలకు
ఇదే మూలమని తెలుసు.. తీయని పంటలకు
లలిత లలిత యువ పవన చలిత పల్లవ దళాలలోనా
రమణీయ కుసుమ రమణీరంజిత నమరగీతిలోనా..
నవనవలాడే అనుభవమేదో..
నన్నే అలగా మలచుకున్నది
నన్నే అలగా మలచుకున్నది
అందుకే ఈ ఆరాటం.. ఇందుకే..
ఇందుకే.. ఆ ఉబలాటం...
కెరటానికి ఆరాటం.. అహహ..
తీరం చేరాలని..
తీరానికి ఉబలాటం.. అహహ..
ఆ కెరటం కావాలని..
లలలాలలలా... లాలాలాలాలలాలాలల...
లలలాలలలా... లాలాలాలాలలాలాలల...
లలలాలలలా... లాలాలాలాలలాలాలల...
లలలాలలలా... లాలాలాలాలలాలాలల...
2 comments:
ఈ పాట వింటుంటే అచ్చు బీచ్ వొడ్డున కూర్చున్నట్టే వుంటుంది..ఓ క్షణం శాంత గంభీరం గా.. అంతలోనే ఉవ్వెత్తున యెగిసి పడే కడలి తరంగంలా..యెంతో బావుంటుందీ ట్యూన్..
థాంక్స్ శాంతి గారు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.