దిన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దిన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, ఏప్రిల్ 23, 2020

మనసు ఉన్నది మమతల కోసం...

వెండితెర మీద ఎలా ఐతే ఒక వెలుగు వెలిగిందో అంతకు రెండింతలు సీరియల్స్ లోనూ ప్రభంజనం సృష్టించిన నటి రాధిక. తమిళంలో తీసిన సీరియల్స్ అయినా జెమినీ టీవీ పుణ్యమా అని తెలుగులోనూ డబ్బింగ్ అయి విశేష ఆదరణ సంపాదించుకున్నాయి తన సీరియల్స్. అలాంటి వాటిలో ఈ శివయ్య ఒకటి. తమిళ్ లో అన్నామలై పేరుతో వచ్చిన ఈ సీరియల్ టైటిల్ సాంగ్ విజువల్స్ ప్రత్యేకంగా ఉండి నాకు భలే నచ్చేవి అప్పట్లో. అలాగే మొదట్లోనూ చివరలోనూ వచ్చే ఆలాపన ఆ ట్యూన్ కూడా ప్రత్యేకంగా ఉండేవి.

నాకు గుర్తున్నంతవరకూ మధ్యాహ్నం ఒకటిన్నరకో రెండింటికో వచ్చేది ఈ సీరియల్. లంచ్ టైమ్ లో అమ్మా నాన్నా ఇద్దరు ఇది చూశాకే ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు. నేను సీరియల్ ఫాలో అవ్వకపోయినా ఇంట్లో ఉంటే మాత్రం టైటిల్ సాంగ్ మిస్సవకుండా చూసేవాడ్ని. ఈ పాటతో పాటు మరికొన్ని సీరియల్ టైటిల్ సాంగ్స్ ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


సీరియల్ : శివయ్య (2002)
సంగీతం : దిన
సాహిత్యం :
గానం : బాలు, స్వర్ణలత

తందాని నానని నానని నానే
తననానీ నానని నానని నానే
తందాని నానేనా ఓఓఓ..
తననానీ నానేనా... 

మనసు ఉన్నది మమతల కోసం
మనిషి బతుకే తీరని దాహం
మూడు నాళ్ళేరా ఓఓఓ ఎవరి బతుకైనా
మరి ఆనాడు నీతోడు వేరెవరు రారు
ఈ జన్మ బంధాలు కడతేరి పోవూ
ఏడేడు జన్మలకు మనకథ ఇంతే

మనసు ఉన్నది మమతల కోసం
మనిషి బతుకే తీరని దాహం
మూడు నాళ్ళేరా ఓఓఓ ఎవరి బతుకైనా
మరి ఆనాడు నీతోడు వేరెవరు రారు
ఈ జన్మ బంధాలు కడతేరి పోవూ
ఏడేడు జన్మలకు మనకథ ఇంతే

ఇంకో జన్మా ఉందో లేదో
ఎవరికి తెలుసమ్మా
మళ్ళీ జన్మకు నువ్వూ నేనూ
ఎవరై పుడతామో
ఏనాటిదో ఈ బంధము
ఏ చోటికో ఈ పయనమూ
మళ్ళీ మళ్ళీ పుడుతుంటాం
ఎవరికి ఎవరో అవుతుంటాం
తీరీ తీరని ఆశలతో
ఎపుడో విడిపోతాం

మనసు ఉన్నది మమతల కోసం
మనిషి బతుకే తీరని దాహం
మూడు నాళ్ళేరా ఓఓఓ ఎవరి బతుకైనా
మరి ఆనాడు నీతోడు వేరెవరు రారు
ఈ జన్మ బంధాలు కడతేరి పోవూ
ఏడేడు జన్మలకు మనకథ ఇంతే

తందాని నానని నానని నానే
తననానీ నానని నానని నానే
తందాని నాననినా ఓఓఓ..
తననానీ నానానా...  

 

బుధవారం, ఏప్రిల్ 15, 2020

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా...

టీవీ సీరియల్స్ చూడకపోయినా ఒకే సమయానికి ప్రతి ఇంట్లో మోగే టీవీల్లోంచి వచ్చే ఆ సీరియల్స్ టైటిల్స్ సాంగ్ నుండి మాత్రం తప్పించుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఇక కాస్తో కూస్తో పాటల పిచ్చి ఉన్నవాళ్ళకి అసలు అసాధ్యం. అప్పట్లో అన్ని సీరియల్ పాటలు కాకపోయినా కొన్ని కొన్ని పాటలు భలే ఆకట్టుకునేవి మనకి తెలియకుండానే పాడేసుకునేంతగా నాటుకు పోయేవి వాటిలో అమృతం, ఋతురాగాలు, తర్వాత ఈ 'పిన్ని' అనే సీరియల్ సాంగ్. ఈ పాట ఐన తర్వాత పిన్నీ అని పిలిచే పిలుపు భలే చిత్రంగా అనిపించేది. ఎప్పటినుండో తెలియదు కానీ ఈ సీరియల్ రెండో సీజన్ మొదలవుతుందని విన్నాను.

ఈ పాటకి సంగీతం అందించినది ఎక్కువగా తమిళ్ టీవీ సీరియల్స్ కి సంగీతం అందించే 'దిన' అయితే రాసినది ఓంకార్ పరిటాల వీరు సీనియర్ నటుడూ మరియూ రచయిత, మన రియాల్టీ షోస్ వన్ సెకన్ ఓంకార్ కాదు. కొన్ని సినిమాల్లో కూడా వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ సంభాషణా శైలితో ఆకట్టుకున్నారు, అలాగే తన రచనలలో సామాజిక అంశాలను చొప్పించి పేరు తెచ్చుకున్నారు. ఈ పాట ఫస్ట్ సీజన్ వీడియో మంచి క్వాలిటీ వర్షన్ ఇక్కడ చూడవచ్చు. ఇదే పాట సెకండ్ సీజన్ విజువల్స్ తో  ఇక్కడ చూడవచ్చు.


సీరియల్ : పిన్ని
సంగీతం : దిన
సాహిత్యం : పి. ఓంకార్ (సీనియర్ యాక్టర్/రైటర్)
గానం : నిత్యశ్రీ 

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి..

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి.. 

నిని సాసాస.. నిని సాసాస
నిసగగ నిసగగ గమపమగరిసా
నిసగగ నిసగగ గమపమగరిసా

కడలిని చేరిన నదికి విశ్రాంతి
తరుణికి మాత్రం తీరని భ్రాంతి
పచ్చని పైరుకు నది ఆధారం
బ్రతుకున వెలుగుకు ఆడది మూలం
గంగ పొంగి పొరలిందా ప్రళయ తాండవం కాదా
సీత గీత దాటిందా యుద్దకాండ మొదలేగా
ఆ నది ఆడది శక్తి స్వరూపాలే...ఓఓఓ...
ఝుంతనఝనఝన..ఝుంతనఝనఝన..
ఝుంతన..ఝుంతన..ఝుంతనన..ఓఓఓ...

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా
మమతల మందాకినీ మగువేనమ్మా
ఆ నదులన్నీ కొండాకోనలు దాటాలి
ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి

కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో
నదులకు నడకలు సాగాలి..
తనువును మనసును త్యాగం చేస్తూ
పడతులు పయనం చేయాలి.. 


బుధవారం, ఫిబ్రవరి 10, 2016

సింధూర పువ్వా తేనె...

సింధూరపువ్వు చిత్రంలోని ఓ చక్కని ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సింధూరపువ్వు (1988)
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, చిత్ర

సింధూర పువ్వా తేనె చిందించరావా..
చిన్నారి గాలీ సిరులే అందించరావా
కలలే విరిసేనే..కథలే పాడెనే..
ఒక నదివోలే ఆనందం..
ఎద పొంగెనే..ఏ..ఏ..ఏ..
ఓ..సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలీ సిరులే అందించరావా

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఊ..ఊ..ఊ
హో..హో..హో..హో..ఓ..ఓ..ఓ..ఓ..
కమ్మని ఊహలు కలలకు అందం
వీడని బంధం కాదా...
గారాల వెన్నెల కాసే సరాగాల తేలీ..

కమ్మని ఊహలు కలలకు అందం
వీడని బంధం కాదా
గారాల వెన్నెల కాసే సరాగాల తేలి...
అందాల సందడి చేసే రాగాలనేలి...

సింధూర పువ్వా తేనె చిందించరావా..
చిన్నారి గాలీ సిరులే అందించరావా

మాటల చాటున నాదం నువ్వే
తీయని పాట నేనే
మధుమాస ఉల్లాసాలే పలికించేనే

ఆహాహా.. మాటల చాటున నాదం నువ్వే
తీయని పాట నేనే
మధుమాస ఉల్లాసాలే పలికించేనే...
మురిపాలు చిందే హృదయం కోరేను నిన్నే..

సింధూర పువ్వా తేనె చిందించరావా..
చిన్నారి గాలీ సిరులే అందించరావా

అలలై పొంగే ఆశలు కోటి ఊయలలూగే వేళా...
నా చెంత తోడై నీడై వెలిశావు నీవే

అలలై పొంగే ఆశలు కోటి ఊయలలూగే వేళా...
నా చెంత తోడై నీడై వెలిశావు నీవే
రాగాలు ఆలపించి పిలిచావు నన్నే...

సింధూర పువ్వా తేనె చిందించరావా..
చిన్నారి గాలీ సిరులే అందించరావా




బుధవారం, ఆగస్టు 13, 2014

వానా వానా వల్లప్ప...

దొంగ దొంగది సినిమా కోసం దిన సంగీత దర్శకత్వంలో కులశేఖర్ గారు రాయగా 'సదాఫ్' పై చిత్రీకరించిన ఈ పాట మాంచి హుషారుగా సాగే మరో అందమైన పాట, ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : దొంగ దొంగది (2004) 
సంగీతం : దిన 
సాహిత్యం : కులశేఖర్ 
గానం : చిత్ర 

వయసేమో పదహారు.. పరిగెత్తే సెలయేరు.. 
పరువాల సిత్రాలు.. పడుసోళ్ళ ఆత్రాలు..
నిదురోని నేత్రాలు.. నిలువెల్లా గాత్రాలూ..
మతిపోయే అందాలూ.. శతకోటీ దండాలు..

వానా వానా వల్లప్ప తిరుగుదామిలా... 
నింగీ నేలా హరివిల్లై కలుపుదామిలా.. 
మబ్బుల్లో హంసలాగ.. మల్లెల్లో మంచులాగ.. 
కన్నుల్లో సిగ్గులాగ.. వెన్నెల్లో ముగ్గులాగ..
దోసిట్లో చినుకులాగ.. వాకిట్లో తులసి లాగ.. 
వరిచేలో గువ్వలాగ.. పెదవుల్లో నవ్వులాగ.. 
మనమంతా గంతులాడుదాం... 
సిరిమువ్వై చిందులాడుదాం..  
సరదాగ ఆటలాడుదాం.. 
పరువాలా పాటపాడుదాం..

వానా వానా వల్లప్ప తిరుగుదామిలా... 
నింగీ నేలా హరివిల్లై కలుపుదామిలా.. 

అహ తుళ్ళిపడే ఈడులో.. తుమ్మచెట్టు నీడలో..
చెమ్మ చెక్క ఆటలాడుదాం.. 
పొద్దుపొడుపు వేళలో.. అత్తమడుగు వాగులో.. 
ఆదమరిచి ఈదులాడుదాం..
పక్కింటిలోన కుర్రాణ్ణి కదుపుదామా.. 
ఆహా..ఆఅహ..ఆఅ...
పక్కింటిలోన కుర్రాణ్ణి కదుపుదామా..
మాటలతో మాయ చేసి కథాకళీ ఆడిద్దామా..
గుండ్రంగా తిప్పిద్దామా... గుంజీల్లే తీయిద్దామా..
గుండ్రంగా తిప్పిద్దామా... గుంజీల్లే తీయిద్దామా..

వానా వానా వల్లప్ప తిరుగుదామిలా... 
నింగీ నేలా హరివిల్లై కలుపుదామిలా.. 

గడ్డివాము చాటుగా లంక చుట్ట ఘాటుగా 
గుప్పు గుప్పు మంటు లాగుదాం..
ఊరిపెద్ద గుట్టుగా.. రంగితోటి పచ్చిగా.. 
కులుకుతున్న మాట చాటుదాం.. 
కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా.. 
డింకటకరి డింక హే డింకటకా..ఆఅ..
కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా.. 
వీధుల్లో చేరి మనం వసంతాలు ఆడేద్దామా.. 
వయ్యారం ఒలికిద్దామా.. సంగీతం పలికిద్దామా..
వయ్యారం ఒలికిద్దామా.. హా సంగీతం పలికిద్దామా.. 

వానా వానా వల్లప్ప తిరుగుదామిలా... 
నింగీ నేలా హరివిల్లై కలుపుదామిలా.. 
మబ్బుల్లో హంసలాగ.. మల్లెల్లో మంచులాగ.. 
కన్నుల్లో సిగ్గులాగ.. వెన్నెల్లో ముగ్గులాగ..
దోసిట్లో చినుకులాగ.. వాకిట్లో తులసి లాగ.. 
వరిచేలో గువ్వలాగ.. పెదవుల్లో నవ్వులాగ.. 
మనమంతా గంతులాడుదాం... 
సిరిమువ్వై చిందులాడుదాం..  
సరదాగ ఆటలాడుదాం.. 
పరువాలా పాటపాడుదాం.. 

లాల్లాఅ..లాల్లాఅ...లల్లాల లల్లాల...
లాల్లాఅ..లాల్లాఅ...లల్లాల లల్లాల... 
 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.