మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 
చిత్రం : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021)
సంగీతం : గోపీసుందర్ 
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : హనియా నఫీసా, గోపీసుందర్ 
ఆకాశమంతా ఆనందమై 
తెల్లారుతోందే నాకోసమై
ఆలోచనంతా ఆరాటమై 
అన్వేషిస్తోందే ఈ రోజుకై
యే జిందగీ ఇవ్వాళా 
కొంగొత్తగా నవ్వేలా
ఈ మాయాజాలమంతా 
తనదేగా..ఆఆఆఆ....
పాదాలు పరుగయ్యేలా 
ప్రాణాలు వెలుగయ్యేలా
ఓ తోడు దొరికే నేడు 
తనలాగా...ఆఆఆఆ..
ఆకాశమంతా ఆనందమై 
తెల్లారుతోందే నాకోసమై
నా పెదవంచుకు 
తన పేరు తోరణం
నా చిరునవ్వుకు 
తనేగ కారణం
దాయి దాయి దాయి 
దాయి దాయి దాయి
తనుంటే చాలు చాలు
హాయి హాయి హాయి 
హాయి హాయి హాయి
పరిమళాలూ పంచవా క్షణాలు
మొదలయ్యా నీవలన 
నీతోనే పూర్తవనా
ఆకాశమంతా ఆనందమై 
తెల్లారుతోందే నాకోసమై
ఆలోచనంతా ఆరాటమై 
అన్వేషిస్తోందే ఈ రోజుకై
యే జిందగీ ఇవ్వాళా
కొంగొత్తగా నవ్వేలా
ఈ మాయాజాలమంతా 
తనదేగా...ఆఆఅ...
పాదాలు పరుగయ్యేలా 
ప్రాణాలు వెలుగయ్యేలా
ఓ తోడు దొరికే నేడు 
తనలాగా...ఆఆఆ... 
 


 
 


 
 
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.