శనివారం, ఏప్రిల్ 24, 2021

కు కు కు కోకిలమ్మ...

పోస్ట్ మాన్ సినిమా లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : పోస్ట్ మాన్ (2000)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్  
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ 
గానం : ఏసుదాస్, స్వర్ణలత 

కుకురే కుకురే కుకురే కుకురే
కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ
కమ్మనైన కబురే తేవమ్మా
గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక
గూటిలోని చోటే నీదమ్మా

ఏ మనసు తొలిసారి కలిసిందో 
ఎవరంటే తెలిసిందో ఇది ప్రేమని
ఏ జంట మలిసారి వలచిందో 
బదులిమ్మని అడిగిందో ఆ ప్రేమని
వీచే గాలి చల్లదనాలు దీవెనలేనంటా
పూచే పువ్వై నిదురించేది నీ ఒడిలోనంటా

కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ
కమ్మనైన కబురే తేవమ్మా

ఆరు రుతువుల నింగి తోటలో
తోటమాలికి ఈ తొందరెందుకో
తొడునీడగా చేయి వీడక
బాటసారిని తీరాన చేర్చుకో
నీలాల నింగి ఆ తారలన్ని
ఏ ప్రేమ చేసిన చిరు సంతకం
జతగా ఓ ప్రేమ కథగా
ఎన్నేళ్ల కైనా ఉందాములే
ఎన్నో జన్మల అనుబంధాలే హారతులవ్వాలి
నవ్వే నువ్వై నువ్వే నేనై ఒకటై పోవాలి

కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ
కమ్మనైన కబురే తేవమ్మా
గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక
గూటిలోని చోటే నీదమ్మా

ఇంద్ర దనసులో ఏడు రంగులు
పల్లవించని నీ మేని సొంపులో
తాజ్మహల్ లో ఉన్న వైభవం
తొంగి చూడని తొలి ప్రేమలేఖలు
నీ మాటలన్ని నా పాటలైతే
నిను దాచుకోన నా కవితగా
పలికే నా పాటలోన 
కలకాలముంటా నీ ప్రేమనై
కలిసి ముందుకు సాగేటందుకు 
అడుగులు కలపాలి
ముద్దు ముచ్చట తీరేటందుకు 
ముడులను వేయాలి

కు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మ
కమ్మనైన కబురే తేవమ్మా
గు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింక
గూటిలోని చోటే నీదమ్మా
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.