శనివారం, మార్చి 31, 2012

ముచ్చటైన మిథునం..

సినిమా మొదలైనపుడెన్ని సందేహాలో... ఇపుడీ ట్రైలర్ చూస్తే అన్నీ పటాపంచలైపోయాయి.. కథకు చేర్పులున్నట్లున్నా.. అవి మంచివిలానే కనపడుతున్నాయ్.. జేసుదాస్ గారి గానం, వీణాపాణి గారి సంగీతం, జొన్నవిత్తుల గారి సాహిత్యం.. భరణి దర్శకత్వం.. మధురమీ బాలూ లక్ష్మిల మిథునం.. అరవైదాటిన ఆలూమగలా అనురాగామృత మధనం.. ఎప్పుడెపుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను.


చిత్రం : మిథునం
సంగీతం : స్వరవీణాపాణి
గానం : కె.జె. ఏసుదాస్
సాహిత్యం : జొన్నవిత్తుల

ఆది దంపతులే అభిమానించే.. అచ్చతెలుగు మిథునం..
ఆది దంపతులే అభిమానించే.. అచ్చతెలుగు మిథునం..
అవనిదంపతులు ఆరాధించే ముచ్చటైన మిథునం..
అవనిదంపతులు ఆరాధించే ముచ్చటైన మిథునం..
సుధాప్రేమికుల సదనం.. సదాశివుని మారేడువనం..
సదాశివుని మారేడువనం..
ఆది దంపతులే అభిమానించే.. అచ్చతెలుగు మిథునం..

దాంపత్యరసఙ్ఞుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం..
నవరసమాన సమర సమాన..
నవరసమాన సమర సమాన.. సహకార స్వరమేళనం..
భారతీయతకు హారతి పట్టే ఋషిమయ జీవన విధానం..
భార్య సహాయముతో కొనసాగే భవసాగర తరణం..
భవసాగర తరణం..
ఆది దంపతులే అభిమానించే.. అచ్చతెలుగు మిథునం..

అల్పసంతసపు కల్పవృక్షమున ఆత్మకోకిలల గానం..
పురుషార్ధముల పూలబాటలో.. పుణ్యదంపతుల పయనం..
అరవైదాటిన ఆలూమగలా...
అరవైదాటిన ఆలూమగలా అనురాగామృత మధనం..
గృహస్థ దర్మం సగర్వమ్ముగా తానెగరేసిన జయకేతనం..
జయకేతనం...

ఇతిశివమ్!
తనికెళ్ళ భరణి.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.