శనివారం, మార్చి 31, 2012

ముచ్చటైన మిథునం..

సినిమా మొదలైనపుడెన్ని సందేహాలో... ఇపుడీ ట్రైలర్ చూస్తే అన్నీ పటాపంచలైపోయాయి.. కథకు చేర్పులున్నట్లున్నా.. అవి మంచివిలానే కనపడుతున్నాయ్.. జేసుదాస్ గారి గానం, వీణాపాణి గారి సంగీతం, జొన్నవిత్తుల గారి సాహిత్యం.. భరణి దర్శకత్వం.. మధురమీ బాలూ లక్ష్మిల మిథునం.. అరవైదాటిన ఆలూమగలా అనురాగామృత మధనం.. ఎప్పుడెపుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాను.


చిత్రం : మిథునం
సంగీతం : స్వరవీణాపాణి
గానం : కె.జె. ఏసుదాస్
సాహిత్యం : జొన్నవిత్తుల

ఆది దంపతులే అభిమానించే.. అచ్చతెలుగు మిథునం..
ఆది దంపతులే అభిమానించే.. అచ్చతెలుగు మిథునం..
అవనిదంపతులు ఆరాధించే ముచ్చటైన మిథునం..
అవనిదంపతులు ఆరాధించే ముచ్చటైన మిథునం..
సుధాప్రేమికుల సదనం.. సదాశివుని మారేడువనం..
సదాశివుని మారేడువనం..
ఆది దంపతులే అభిమానించే.. అచ్చతెలుగు మిథునం..

దాంపత్యరసఙ్ఞుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం..
నవరసమాన సమర సమాన..
నవరసమాన సమర సమాన.. సహకార స్వరమేళనం..
భారతీయతకు హారతి పట్టే ఋషిమయ జీవన విధానం..
భార్య సహాయముతో కొనసాగే భవసాగర తరణం..
భవసాగర తరణం..
ఆది దంపతులే అభిమానించే.. అచ్చతెలుగు మిథునం..

అల్పసంతసపు కల్పవృక్షమున ఆత్మకోకిలల గానం..
పురుషార్ధముల పూలబాటలో.. పుణ్యదంపతుల పయనం..
అరవైదాటిన ఆలూమగలా...
అరవైదాటిన ఆలూమగలా అనురాగామృత మధనం..
గృహస్థ దర్మం సగర్వమ్ముగా తానెగరేసిన జయకేతనం..
జయకేతనం...

ఇతిశివమ్!
తనికెళ్ళ భరణి.

11 comments:

అబ్బా.. కాసేపటికే అంతా అంతా మసక మసకగా ఉందేంటండీ, వేణూ!! మరి కళ్ళు చెమర్చితే అలానే ఉంటుంది కదా! :-)
ఏమో అనుకున్నా కానీ బాలు, లక్ష్మిలు తక్కువే కనబడుతున్నారు కదా!! ఇక జేసుదాస్ స్వరం చేసే ఇంద్రజాలం కూడా తోడై అసలు మళ్ళీ మళ్ళీ వినాలని/చూడాలని ఉందీ పాట!
ఇంత చక్కని పాటని ఇంత త్వరగా మాముందుకి తెచ్చినందుకు మీకు బోల్డన్ని ధన్యవాదాలు :-)

నిషి మాటే నా మాట కూడా.. భలే బాగున్నాయి ట్రైలరూ, పాట రెండూనూ.. థాంక్స్ వేణూ.. :)

శీర్షిక చూసి సినిమా విడుదల అయిపోయిందేమో అనుకున్నా! నేను కూడా వెయిటింగ్! ఇహ సాహిత్యం అంటారా నా పేరు ఉంది కనుక సూపరే అందులో సందేహమే లేదు! ;)

శ్రీ రమణ గారి "మిధునం" పుస్తకం బాపు గారి దస్తూరి తో చదువుతూ వారి జీవన పయనం ఎంత ముచ్చటగా ఉందో అనుకున్నాము. ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు ఆ ముచ్చటలన్నీ సినిమా గా వస్తుంటే ఈ ట్రెయిలర్ చూశాక ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. వేణు గారూ, థ్యాంక్స్ అండీ!

మధుర మాటే నా మాట కూడా.. భలే బాగున్నాయి ట్రైలరూ, పాట రెండూనూ.. థాంక్స్ వేణూ.. :)

పాట చాలా బాగుంది. సాహిత్యం కూడా.
సినిమా కూడా అంత బాగానే ఉంటుందని ఆశిద్దాము.

వేణు గారూ మిధునం అనగానే సన్నగా పొడవుగా వున్న ఇద్దరు వృద్ద దంపతులు చుట్టూ చెట్లున్న చిన్న ఇంటిలో ఊహించేసుకున్నాను. ఊహకూ వాస్తవానికి పోలిక కొంచెం కష్టంగా..పాట బావుంది.

మౌస్ తిప్పినప్పుడు ఆ హోవర్ తీసెయ్యండి. చాలా విసుగు పుట్టిస్తుంది. :-)

థ్యాంక్స్ నిషిగంథ, సినిమా అంతాకూడా ఇంత బాగా ఉంటుందని అనుకుందాం..
థ్యాంక్స్ మధురా..
రసఙ్ఞ గారు థ్యాంక్స్..
చిన్ని ఆశగారు థ్యాంక్స్..
థ్యాంక్స్ పద్మవల్లి గారు.
థ్యాంక్స్ గురూజీ..అవును సినిమాకూడా బాగుంటుందని ఆశిద్దాము.
జ్యోతిర్మయిగారు థ్యాంక్స్.. కథను సినిమాగా మలచడంలో కొన్ని పరిమితులవల్ల తప్పదేమోనండి. సినిమా చూశాక కానీ ఏంచెప్పలేంలెండి.
అరవింద్ గారు థ్యాంక్స్.. :) చూద్దామండీ ఇంకా ఎవరైనా ఇబ్బందిగా ఉందని చెప్తే తీసేస్తాను. నాకు చాలా నచ్చింది ఆ హోవర్ :)

venu garu mi blog chustunte.. idi edo site la undi .. chala chakkaga design chesaru .. inka post kosam cheppalante.. movie kosam wait chestunnanu..

ధన్యవాదాలు రాజాచంద్రగారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.