బుధవారం, ఏప్రిల్ 25, 2012

ఇదే నా మొదటి ప్రేమలేఖ - స్వప్న

సగటు వీరాభిమానిగా మా బాలసుబ్రహ్మణ్యం ముసలివాడైనా ఆయన గొంతు మారలేదు అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది లాంటి కబుర్లు నేను చెప్పను. వయసుతో పాటు ఆయన గొంతు కూడా మారింది కొన్నిపాటలు లేత గొంతుతో ఒకింత మిమిక్రీని మేళవించి పాడటం బాగుంటే మరికొన్ని పాటలకు ఇప్పుడు ఆయనపాడుతున్న గొంతు అయితేనే బాగా సూటవుతుంది. ఏదైనాకానీ ఎనభైలలో.. బాలు కెరీర్ కొత్తలో తను పాడినపాటలలో తన గొంతు లేతగా చాలా గమ్మత్తుగా ఉంటుంది. సత్యం, రమేష్ నాయుడు గారు వంటి అనాటి సంగీత దర్శకుల వలనకూడా అయి ఉండచ్చు నాకు ఆగొంతు ప్లస్ అప్పట్లో పాడిన పాటలు చాలా ఇష్టం.

వాటిలో ఒకటి ఈ ఇదే నామొదటి ప్రేమలేఖ పాట.. అప్పట్లో ఈ పాట రేడియోలో వస్తుంటే స్టేషన్ మార్చే ప్రసక్తేలేదు. ఈ పాటలో సంగీత సాహిత్యాలను పట్టించుకోకుండా బాలు స్వరం మాత్రం గమనిస్తూ వినండి ప్రారంభంలో ఆ ఆలాపనా, అక్కడక్కడ అల్లరినవ్వు, ప్రేమా అని ఒక్కోసారి ఒక్కోవిధంగా పలికేతీరు అన్నీ ఖచ్చితంగా ఎంజాయ్ చేయచ్చు. మీకోసం ఈ పాట యూట్యూబ్ లింక్ ఇక్కడ.. ఖంగారు పడకండి ఒరిజినల్ వీడియో నేనూ ఇప్పటివరకూ చూడలేదు. ఇది కేవలం ప్రజంటేషన్ మాత్రమే.  యూట్యూబ్ పనిచేయనివారు ఆడియొ ఇక్కడ వినచ్చు..


చిత్రం : స్వప్న
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

మెరుపనీ పిలవాలంటే..ఆ వెలుగు ఒక్క క్షణం..
పూవనీ పిలావాలంటే..ఆ సొగసు ఒక్క దినం..
ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ..
ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ!!
తెలిసింది  ఒక్కటే.. నువ్వు నా ప్రాణమనీ!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

తారవని అందామంటే.. నింగిలో మెరిసేవూ..
ముత్యమని అందామంటే.. నీటిలో వెలిసేవూ..
ఎదలోన కదిలే నిన్నూ.. దేనితో సరిపోల్చాలో??
ఎదలోన కదిలే నిన్నూ.. దేనితో సరిపోల్చాలో??
తెలిసింది ఒక్కటే..నువ్వు నా ప్రాణమని!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..

5 comments:

వేణూ మరో చక్కని పాట సరిగమలలో అందించారు :-) బాలు గారి గళం గురించి మంచి ఇంట్రో ఇచ్చారు.

పాట సాహిత్యం వేటూరి గారు; నిస్సందేహంగా దిద్దేయండి.

చాలా మంచి పాట గుర్తు చేశారు, వేణూ..
నిజంగా అప్పటి బాలు గొంతులోని మృదుత్వం.. మార్దవం.. వెరసి ఇలాంటి ఎన్నో మధురమైన పాటలు మనకి మిగిలాయి కదా!!

దీనితో పాటు ఇంకో పాట "రాశాను ప్రేమలేఖలెన్నో.. దాచాను ఆశలన్ని నీలో" ని కలిపి awesome twosome అంటారు :))

అలాంటిదే ఇంకో జంట -- నీలాల నింగిలో & నింగీ నేలా ఒకటాయెలే :-)

బాలు గొంతు అనగానే, ఊ ఆలాక్కాదు గానీ, కొన్ని కొన్ని పాటలు గుర్తు చేసుకుంటే చాలు, చక్కని అనుభూతి పడవల్లోకి తోసి, హాయి తీరాలకి నడిపిస్తాయి. ఈ పాట అలాగే వేణు. పోతే, అంత్యాక్షరి లో అందెవేసినవాళ్ళకి (అంటే నాకూనూ ;)) గుర్తుకువచ్చి తీరే మరో పాట - ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావనికనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని...

నిషి, మీ మాదిరిగా నాకు తెలిసిన మరొక జత "నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా" , "వస్తా నీ వెనుక ... ఎటైనా కాదనకా ... ఇస్తా కానుకగా … ఏదైనా లేదనకా"

ధన్యవాదాలు నిషీ.. సరిగ్గా ఈ పాట పోస్ట్ చేసేప్పుడు నాకు కూడా ఆ “రాశాను ప్రేమలేఖలెన్నో” పాటే గుర్తొచ్చింది కానీ మొన్నామధ్య ఆపాట వీడియో చూశాక దానిమీద ఇష్టం సగానికి సగం తగ్గిందిలెండి అందుకే ప్రస్తావించలేదు.

ధన్యవాదాలు ఉషగారు.. “చక్కని అనుభూతి పడవల్లోకి తోసి, హాయి తీరాలకి నడిపిస్తాయి.” ఆహ్హ మీదైన శైలిలో ఎంత బాగా చెప్పారండీ.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.