మంగళవారం, మే 01, 2012

ఒక వేణువు వినిపించెను


బాలు పాటలంటే ఎంత ఇష్టమున్నా అప్పుడప్పుడు వేరే వారి గొంతు కూడా వినడం కాస్త వైవిధ్యంగా బాగుండేది ఇక ఆ స్వరం మరికాస్త వైవిధ్యంగా ఉండి మంచి పాటలు పాడితే... ఎన్నేళ్ళైనా అలా గుర్తుండిపోతుంది ఆ స్వరం. అలాంటి స్వరమే జి.ఆనంద్ గారిది. ఒకసారి ఈ పాటలు గుర్తు చేసుకోండి... ఒకవేణువు వినిపించెను (అమెరికా అమ్మాయి), దిక్కులు చూడకు రామయ్యా.. పక్కనె ఉన్నది సీతమ్మ (కల్పన), విఠలా పాండురంగ.. నువ్వెవరయ్యా నేనెవరయ్యా(చక్రధారి), పువ్వులనడుగు నవ్వులనడుగు రివ్వున ఎగిరే గువ్వలనడుగు (ఆమెకథ). వీటన్నిట్లోను వైవిధ్యమైన ఆ స్వరం గుర్తొస్తుంది ముంది.

అప్పటి వరకూ సినీ గీతాలలో కోరస్ పాడుతున్న ఆనంద్ గారు మొదటగా పాడిన సోలో సాంగ్ "అమెరికా అమ్మాయి" సినిమాలోని ఈ పాట “ఒక వేణువు వినిపించెను” నాకు బాగా ఇష్టమైన పాట. మీ అందరికోసం ఇక్కడ ఇస్తున్నాను. ఈ సినిమాలో బాలు పాడిన పాటలు ఏవీ నాకు అంతగా నచ్చలేదు, అందులో బాలుగారి దోషంలేదనుకోండి. ఇదే సినిమాలో మరింత ప్రాచుర్యాన్ని పొందిన “పాడనా తెలుగు పాట” మీకందరికి తెలిసే ఉంటుందనుకుంటాను. ఈ సినిమా దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు.

జి.ఆనంద్ గారి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే వారి ఇంటర్వూ ఇక్కడ చూడచ్చు. వీడియో ప్లే అవకపోతే ఆడియో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : అమెరికా అమ్మాయి 1976
సంగీతం : జి.కె.వెంకటేష్
సాహిత్యం : మైలవరపు గోపీ
గానం : జి.ఆనంద్

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..
ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..
ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..

సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
నవమల్లిక చినబోయెనూ..నవమల్లిక చినబోయెనూ..
చిరునవ్వు సొగసులో!!

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..

వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ..
వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ..
రేరాణియే నా రాణికీ..రేరాణియే నా రాణికీ..
పారాణి పూసెనూ!!

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..

ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా??
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా??
నా గుండెలో వెలిగించెనూ..నా గుండెలో వెలిగించెనూ..
సింగార దీపికా!!

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..
ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా!!

5 comments:

వేణు,

ఇక్కడి నించి అక్కడికి అక్కడినించి ఇక్కడికి అలా మీ టపాలో లంకెలతో గంట సేపు కాలక్షేపం అయిపోయింది..

నేను కల్పన లో పాట రామ కృష్ణ పాడారనుకున్నా ..ఆనంద్ అని ఇప్పుడే తెలిసింది ..

Balu sang this song in Kannada
If you can find it listen to it sir
you'll enjoy

వినడానికి, చూడడానికీ కూడా ఎంత చక్కగా ఉందీ పాట!

చాలా మంచి పాట వేణు...మీవల్ల మరోసారి విన్నాను.

ధన్యవాదాలు వాసు గారు, హమ్మయ్య టైంపాస్ అయింది అంతే కదా వేస్ట్ అయిందని ఫీల్ అవలేదు కదా సంతోషం :) నిజమేనండీ రామకృష్ణ గారి పాటలకు ఆనంద్ గారి పాటలకు కొంచెం కన్ఫుజ్ అవుతాం.

అజ్ఞాత గారు ధన్యవాదాలు. తప్పకుండా దొరికితే వింటాను.

జ్యోతిర్మయి గారు ధన్యవాదాలు. వీడియో మొదటిసారి చాలా భయపడుతూ చూశానండీ నాకు కూడా నచ్చింది.

ధన్యవాదాలు సౌమ్యా కుదిరితే వీడియో కూడా చూడండి బాగుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.