ఆదివారం, ఏప్రిల్ 30, 2017

కరో కరో జర జల్సా..

ఈ రోజు జల్సా చిత్రంలోని టైటిల్ సాంగ్ తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జల్సా (2008) 
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాబా సెహగల్, రీటా

They call him a cool cool angry man
super andhra తెల్సా..
its the time for toll and the beat
come on come on కరో జల్సా..

జల్సా జల్సా జల్సా జల్సా....yo yo yo yo..
yo he’s the man yo the jackie chan
he’s the king of the andhra
his place is the super groovy hyderabad
and she is the baby gal sandra
yeah సరి గమ పద నిసా
yeah కరో కరో జర జల్సా..
జల్సా..జల్సా..
సని దప మగ రిస ..కరో కరో జర జల్సా..
జల్సా..జల్సా..

తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా
సునామి ఎదురుగ వస్త్తే ఎలాగ కనబడుతుందో..
తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా
తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో..
అరె తెలియకపోతే చూడరబబు
he’s a human tsunami
తెలియాలనుకుంటె danger బాబూ
you got to believe me...

yeah సరి గమ పద నిసా
yeah కరో కరో జర జల్సా..
జల్సా..జల్సా..
సని దప మగ రిస..
కరో కరో జర జల్సా..
జల్సా..జల్సా..

height ఎంతుంటాడో కొలవాలనిపిస్తే..
అమాంతమూ అలా అలా mount everest అవుతాడు..
fightఎంచేస్తాడో.. అని సరదాపడితే..
strecher తనై సరాసరి ward కి చేరుస్తాడు..
అరె గడ్డి పోచ అనుకొని తుంచడానికొస్తే గడ్డపార నమిలేస్తాడు
గుండుసూది చేతికిచ్చి దండ గుచ్చమంటే
కొండతవ్వి పారేస్తాడూ


yeah సరి గమ పద నిసా
yeah కరో కరో జర జల్సా..
జల్సా..జల్సా..
సని దప మగ రిస ..
కరో కరో జర జల్సా..
జల్సా..జల్సా..

మనవాడనుకుంటే చెలికాడవుతాడూ..
హే విమానమై భుజాలపై సవారి చేయిస్తాడు
పగవాడనుకుంటే విలుకాడవుతాడూ..
హే ప్రమాదమై క్షణాలలొ శవాలు పుట్టిస్తాడూ..
హే దోసెడు పూలని తెచ్చిపెట్టమంటే
తోటలన్ని తోలుకొస్తాడు
యమ పాశం వచ్చి పీకచుట్టుకుంటే
దాని తోటి వూయలూగుతాడూ

yeah సరి గమ పద నిసా
yeah కరో కరో జర జల్సా..
జల్సా..జల్సా..
సని దప మగ రిస..
కరో కరో జర జల్సా..
జల్సా..జల్సా..
 

శనివారం, ఏప్రిల్ 29, 2017

డూడు డూడు రారా డూడు...

సరైనోడు సినిమా టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం: సరైనోడు (2016)
సంగీతం: S. S. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం : హర్ద్ కౌర్, బ్రిజేష్ శాండిల్య, సోను కక్కర్

Ya, 1 to the 2 to the 3 to the 4
Maare woh entry tho majaye shor
Swagger galore
So Hardcore!
Ae sarrainodu aaya hill jaaye floor

యే రంగు రంగు సైకిల్ ఎక్కి
టింగు రంగ వచ్చినాడే పిల్లగాడు
యే ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి
ముందు సైడ్ ఎక్కమంటూ పిలిచినాడు

హాయ్ నువ్వు మంచి పిల్లగాడు
కానీ నీ లోపలోడు కంతిరోడు
ఎత్తు పల్లమోస్తే నన్ను
సిత్తు సిత్తు చెయ్యకుండా ఊరుకోడు

సూది గుచ్చినోడే మల్లి నీకు
దూది మందు రాస్తడు
ఒక్కసారి వచ్చి చూడు

హే డూడు డూడు రారా డూడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు
హే డూడు డూడు రారా డూడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు

యే రంగు రంగు సైకిల్ ఎక్కి
టింగు రంగ వచ్చినాడే పిల్లగాడు
యే ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి
ముందు సైడ్ ఎక్కమంటూ పిలిచినాడు

Ya, 1 to the 2 to the 3 to the 4
Maare woh entry tho majaye shor
Swagger galore
So Hardcore!
Ae sarrainodu aaya hill jaaye floor

ఏ లెక్కలో చూసిన వేరి గుడ్డు
ఎట్ట పుట్టేసినావే గ్లామర్ లడ్డు
నీ పక్కనే ఉన్నాది చిట్టూఫండు
పట్టే పాడేసుకోర బుజ్జి పండు

హే మోజు పడ్డది నా మూడు
టచ్ చేసుకుంట అందాల ఐ-పాడ్
మర్చిపోతాలే ఛీ పాడు
ఆటాడమంది నా ఈడు హైలాండ్
ఆడ గుగ్గిలాలు పోసినావే
గుండెలోన గుప్పెడు గుప్పుమంది రాంగ్ సైడ్

హే డూడు డూడు రారా డూడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు

హే డూడు డూడు రారా డూడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు

Boye boye jaani bami
Lagta mujhko mister charming
Tera sang mein rahun hamesha
Tu hai mera only darling
It don't matter way we are
Nachenge hum puri raat
You can do it feel the music
Tu hai mera stylish star

నా చేతిలో ఉన్నది పవర్ గ్రిడ్డు
ఇట్టే మంటెక్కిపొద్ది నీలో బ్లడ్డు
లేట్ చెయ్యనే చెయ్యకు ఎసేయ్ రెడ్డు
రోజా చెంపల్లో వుంది కేరంబోర్డు
పక్క నువ్వుంటే వాట్ టు డు
లగెత్తినాది గుండెల్లో లైల్యాండ్
అస్సలే నువ్వు చిలిపోడు
అందాల నిప్పు అంటింది ఇక చూడు
ఓసి పిల్ల నువ్వు చూస్తా ఉంది టీసరేనే ఇప్పుడు
ముందు ముందు బొమ్మఉంది చూడు

హే డూడు డూడు రారా డూడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు

హే డూడు డూడు రారా డూడు
నువ్వే నువ్వే నువ్వే నాకు సరైనోడు

 

శుక్రవారం, ఏప్రిల్ 28, 2017

భళి భళి భళిరా బళి...

ఈ రోజు విడుదలవుతున్న బాహుబలి 2 చిత్రంలోని టైటిల్ సాంగ్ తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ప్రోమో వీడియో ఇక్కడ చూడవచ్చు పూర్తిపాట లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బాహుబలి 2 (2017)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : కె.శివశక్తిదత్తా, కె.రామకృష్ణ
గానం : దలెర్ మెహందీ, కీరవాణి, మౌనిమ

భళి భళి భళిరా బళి సాహోరే బాహుబలి
భళి భళి భళిరా బళి సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలి పట్టాలి
భువనాలన్నీ జై కొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి

హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స

ఆ జనని దీక్ష అచలం ఈ కొడుకే కవచం
ఇప్పుడా అమ్మకి అమ్మవైనందుకా
పులకరించిందిగా ఈ క్షణం
అడవులు గుట్టలు మిట్ట గమించు
పిడికిటి పిడుగుల్ పట్టి మించు
అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు
అవనికి స్వర్గాలే దించు
అంత మహా బలుడైనా అమ్మ ఒడి పసివాడే
శివుడైనా భవుడైన అమ్మకి సాటి కాదంటాడే

హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స

హేస్స రుద్రస్స హేస్స రుద్రస్స
హేసరభద్ర సముద్రస్స హేసరభద్ర సముద్రస్స

హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స

భళి భళి భళిరా బళి సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలి పట్టాలి
భళి భళి భళిరా బళి సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలి పట్టాలి
భువనాలన్నీ జై కొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి


గురువారం, ఏప్రిల్ 27, 2017

శంభో శివ శంభో...

శంభో శివ శంభో చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం.ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శంబో శివ శంబో (2010)
సంగీతం : సుందర్ సి బాబు
సాహిత్యం : చిన్నిచరణ్
గానం : శంకర్ మహదేవన్

శంబో శివ శంబో... శివ శివ శంబో...
శంబో శివ శంబో... శివ శివ శంబో...

ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీళ్ళకి బదులు నిప్పులు రానీ
పిడికిలి వదలకు పిడుగులు పడనీ చూపర ధైర్యాన్ని
నరాలు తెగిపడి నెత్తురు రానీ నర మేధాలే జరిగిన గానీ
స్నేహం కోసం ప్రాణం పోనీ చెయ్యర యుద్దాన్ని
 
శంబో శివ శంబో... శివ శివ శంబో...
శంబో శివ శంబో... శివ శివ శంబో...


నువ్వెవరు నేనేవరంటు తేడాలే లేకపోతే
లోకం లో శోకం లేదు మనుషుల్లో లోపం లేదు
చీకటిలో విడిపోతుంది నీ నీడే నిన్నొంటరిగా
డబ్బుల్లో భాదల్లోను విడిపోనిది స్నేహమేగా
ప్రపంచమే తల కిందయినా
ప్రేమ వెంట స్నేహం వుంటే విజయమే

శంబో శివ శంబో... శివ శివ శంబో...
శంబో శివ శంబో... శివ శివ శంబో...

ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీళ్ళకి బదులు నిప్పులు రానీ
పిడికిలి వదలకు పిడుగులు పడనీ చూపర ధైర్యాన్ని
నరాలు తెగిపడి నెత్తురు రానీ నర మేధాలే జరిగిన గానీ
స్నేహం కోసం ప్రాణం పోనీ చెయ్యర యుద్దాన్ని
శంబో శివ శంబో... శివ శివ శంబో...
శంబో శివ శంబో... శివ శివ శంబో...


కామంతో కలిసే ప్రేమ కలకాలం నిలబడుతుందా
నదిలోన ముగ్గే పెడితే క్షణమైనా నిలిచుంటుండా
ప్రేమన్నది దైవం లేరా స్నేహం తన రూపమేనురా
మీ ఆశలు తీర్చుకొనుటకు ఆ ముసుగులు వేసుకోకురా
స్నేహానికి జన్మ హక్కురా నీ తప్పు ఒప్పును దిద్దే బాద్యత

సంద్రం రౌద్రం అవుతుందేంటి
మంచే అగ్నిగ మారిందేంటి
ప్రేమ కి గ్రహణం పడుతుందేంటి బదులే రాదేంటి
దిక్కులు దిశలే మరాఏంటి
పడమట సూర్యుడు పోడిచాడేంటి
గుండెల్లో ఈ గునపాలేంటి అసలీ ఈ కథ ఏంటి
శంబో శివ శంబో... శివ శివ శంబో...
శంబో శివ శంబో... శివ శివ శంబో...
 

బుధవారం, ఏప్రిల్ 26, 2017

నిప్పురా...

కబాలి చిత్రం లోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కబాలి (2016)
సంగీతం : సంతోష్ నారాయణ్
సాహిత్యం : వనమాలి
గానం : అరుణ్ రాజ కామరాజ్

నిప్పురా...
తాకరా...
సాధ్యమా...

నిప్పురా తాకరా చూద్దాం
తాకితే మసే కదా మొత్తం
దురాత్ముల దురాగతం నిత్యం
పెరిగితే రగడం తద్యం
జగానికే తలొంచని తుఫాన్ని
జనానికై జన్మించిన నేస్తాన్ని
విధినే గెలవడ ఈశూళి
ఉషస్సులే పరిచెడు 
కబాలి.. కబాలి…

కరుణలు బలి కలతలిక వెలి
మనుసుడికిందా ఉక్కులాడిలు
అంతా నేడు మాయే మాయే
నీ శౌర్యం నిత్యం సమరమాయే
నీ రాజ్యంలోన రగిలే రోషం
ప్రతి మాటకు కొత్త పరమార్ధం

స్వేచ్ఛను ఇక నీ శ్వాసనుకో
భయమును విడు భ్రమనొదిలి నడువ్
ధైర్యం త్యాగం చేసే పోరు
నిను తాకిన గాయం మానే తీరు
ఇక ద్రోహం క్రోధం మాయం కావా
రాబోయే కాలం ఇతిహాసం గాధా
కబాలి కబాలి కబాలి కబాలి..



మంగళవారం, ఏప్రిల్ 25, 2017

కోకిలా...

గీతాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన కోకిల చిత్రం టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కోకిల (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

కోకిల.. కోకిల.. కోకిల
ఏయ్.. ఏయ్.. నే కావాలా?.. హహహా

కోకిలా... కొ క్కొ కోకిల
కూతలా... రసగీతలా

 గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా 

ఐ లవ్ యూ... రేయ్ నువ్వు కాదురా ఐ లవ్ యూ.. నేనురా..
హ హ హ.. ఐ లవ్ యూ... ఐ లవ్ యూ 

ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ...
ఐ లవ్ యూ
 
జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే.. నీ పాట వింటే
ఆకాశ దేశాన తారమ్మలాడే.. నీ కొమ్మ వాకిటే
ముక్కమ్మ కోపం... ఛీఫో
ముద్దొచ్చె రూపం... వదులు
కన్నుల్లో తాపం... హహహ
వెన్నెల్లో దీపం... హోయ్
నాలోని లల్లాయికే.. నీకింక జిల్లాయిలే
లయలేమో హొయలేమో ప్రియభామ కథలేమో

కోకిల కొ క్కొ కోకిల.. కూతలా రసగీతలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ...

హే.. హే.. కొమ్మ పండే.. కొమ్మ పండే..
రెమ్మ పండే.. రెమ్మ పండే..
కొమ్మ పండే.. రెమ్మ పండే.. కొరుక్కు తింటావా
కొమ్మ పండే.. రెమ్మ పండే.. కొరుక్కు తింటావా
బుగ్గా పండే... బుగ్గా పండే
సిగ్గు పండే... సిగ్గు పండే
బుగ్గా పండే... సిగ్గు పండే.. కొనుక్కుపోతావా
బుగ్గా పండే... సిగ్గు పండే.. కొనుక్కుపోతావా

కొండల్లో వాగమ్మ కొంకర్లుపోయే నీ గాలి సోకే
ఈ చైత్రమాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే
పైటమ్మ జారే.. ప్రాణాలు తోడే
వయ్యారమంతా.. వర్ణాలు పాడే
జాలీగా నా జావళీ... హాలీడే పూజావళి
ఇక చాలు సరసాలు.. ముదిరేను మురిపాలు

కోకిలా.. కొ క్కొ కోకిల
కు కు కూతలా రసగీతలా.. అహహహా...
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ


సోమవారం, ఏప్రిల్ 24, 2017

మైనేమ్ ఈజ్ బిల్లా...

బిల్లా చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బిల్లా (2009)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : రంజిత్, నవీన్ మాధవ్

నేనుండే స్టైలే ఇలా ఎదిగానే నియంతలా
ఎవరైనా సలాం అనేలా
అడుగడుగు ఒకేలా నడవనుగా ఏవేళా
ఎవరో నన్నూహించేలా
నే వల విసిరితె విల విల
నే అలా కదిలితే హల్లాగుల్లా 
 
మైనేమ్ ఈజ్ బిల్లా బి ఫర్ బిల్లా
ఒకటే సైన్యంలా వచ్చానిల్లా
మైనేమ్ ఈజ్ బిల్లా బిజిలి బిల్లా
మనిషే మెరుపైతే ఉంటాడిల్లా

ఎనిమి ఎవ్వడైనా యముడే నేనేనంట
డేంజర్ కి అర్ధం చూపిస్తా
భయమే నాకెదురైనా దాన్ని బంతాడేస్తా
పాతాళంలో పాతేస్తా
నాగతం పిడుగుకు చలిజ్వరం
నాయుగం నాకది ఆరోప్రాణం

మైనేమ్ ఈజ్ బిల్లా హంటర్ బిల్లా
నాకే ఎదురొచ్చి నిలిచేదెల్లా
మైనేమ్ ఈజ్ బిల్లా టైగర్ బిల్లా
పంజా గురి పెడితే తప్పేదెల్లా

మనిషిని నమ్మను నేను
మనసును వాడను నేను
నీడై నన్నే చూస్తుంటా
మూడో కన్నే గన్ను ముప్పే రానివ్వను
మరణం పైనే గెలుస్తా
నా గతం నిన్నటితోనే ఖతం
ఈ క్షణం రేపో రానీ రణం

మైనేమ్ ఈజ్ బిల్లా డెడ్లీ బిల్లా
దూకే లావానీ ఆపేదెల్లా
మైనేమ్ ఈజ్ బిల్లా ఓన్లీ బిల్లా
ఎపుడేం చేస్తానో చెప్పేదెల్లా 


ఆదివారం, ఏప్రిల్ 23, 2017

రామరామకృష్ణకృష్ణ...

రామ రామ కృష్ణ కృష్ణ సినిమా టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రామరామకృష్ణకృష్ణ(2010)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : కార్తీక్, రంజిత్, సుధా జీవన్

మావిడిలంక రేవుల్లో పడవెక్కి పావుగంట
గోదారిని దాటి అవతలపక్క ఎద్దులబండిని ఎక్కు హేయ్
గాంధీపురం సెంటర్లోనా దిగిపోగానే అక్కడినుంచి
ప్రెసిడెంట్ గారి ఇంటికి దారి లెఫ్టురైటు వాకబుచేయ్
ఆపక్కన ఏదో గందరగోళం కనిపిస్తుంటే
తొందరగెళ్ళి మందల దూరేయ్ రోయ్
దబదబదబ తన్నులు తింటూ
లబోదిబో మని కేకలు పెట్టే కరోడ శాల్తీ
కాలరు పట్టిన కరెంటు చేతిని చూసి
ఆ చేతిని దాటి చూపును ఇంకొంచెం
ఇంకొంచెం మీదికి తెస్తే కండల అందం
కనిపిస్తుందిరోయ్ ఇంకోంచెం టాప్ కి
టర్నింగ్ ఇచ్చుకున్నావంటే
హూ ఈజ్ దిస్ మాన్..

రామ రామ కృష్ణ కృష్ణ రచ్చమీద రామ కృష్ణ
ఒక సైడు చూడు సాయమొచ్చే రామ రామ రామా
అటు సైడు వీడు మాయ చేసే కృష్ణ కృష్ణ
సంటైమ్స్ సంటైమ్స్ రామ రామ
సంటైమ్స్ సంటైమ్స్ కృష్ణా
సంటైమ్స్ సంటైమ్స్ రామ రామ
సంటైమ్స్ సంటైమ్స్ కృష్ణా
రామ రామ కృష్ణ కృష్ణ రచ్చమీద రామ కృష్ణ

ఎదురుగా పది తలలున్నా ఒక్క దెబ్బకి పడిపోవా
రామ రామ రామరామ
పడుచు అందాలేవైనా ఒక ఈలకే లొంగిపోవా
కృష్ణ కృష్ణ కృష్ణకృష్ణ
నాన్నమాటే కాకుండా అమ్మదీ జవదాటడట
గీతలెన్నో దాటినా గీతార్ధమే మరవడంట
కోతి మూక తో పెద్ద పనులు చక్కబెట్టేస్తాడు ఎక్కడైనా
భూమి పగిలినా బుగ్గమీదే చిరునవ్వే చెదరదెపుడైనా

సంటైమ్స్ సంటైమ్స్ రామ రామ
సంటైమ్స్ సంటైమ్స్ కృష్ణా
సంటైమ్స్ సంటైమ్స్ రామ రామ
సంటైమ్స్ సంటైమ్స్ కృష్ణా
రామ రామ కృష్ణ కృష్ణ రచ్చమీద రామ కృష్ణ

మాటకూడా బాణంలా సూటిగా దిగిపోతాదీ
బుర్రమాత్రం చక్రంలా గిరుగిర్రున తిరుగుతాది
రాజ్యమంతా తనదైనా చెట్లవెంటే నడిచేది
వెన్నలాంటి మనసే వేల మనసులే దోచుకుంది
ఊరి కోసమే భూమి ఉందని చెప్పు మంచితనం
కేరు చేయనని పాము నెత్తిపై చిందులేయు మొండితనం

సంటైమ్స్ సంటైమ్స్ రామ రామ
సంటైమ్స్ సంటైమ్స్ కృష్ణా
సంటైమ్స్ సంటైమ్స్ రామ రామ
సంటైమ్స్ సంటైమ్స్ కృష్ణా
రామ రామ కృష్ణ కృష్ణ రచ్చమీద రామ కృష్ణ


శనివారం, ఏప్రిల్ 22, 2017

జయహో జనతా...

జనతాగ్యారేజ్ సినిమాలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జనతాగ్యారేజ్ (2016)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : సుఖ్వీందర్ సింగ్, విజయప్రకాష్

ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
ఐన అందరి బంధువులు
జయహో జనతా

ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు
జగమంతా మనదే పరివారం అంటారు
ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు
పరులకు వెలుగిచ్చే ద్యేయంగా పుట్టారు

ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
ఐన అందరి బంధువులు
జయహో జనతా

ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

హో ఆపదలో నిట్టూర్పు
అది చాల్లే వీరికి పిలుపు
దూసుకు పోతారూ దుర్మార్గం నిలిపేలా
ఎక్కడికక్కడ తీర్పు
వీరందిచే ఓదార్పూ
తోడై ఉంటారూ తోబుట్టిన బందం లా
మనసే చట్టంగా
ప్రతి మనిషికి చుట్టంగా
మేమున్నామంటారూ
కన్నీలలొ నవ్వులు పూయిస్తూ

ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
ఐన అందరి బంధువులు
జయహో జనతా

ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

హుమ్. దర్మం గెలవనిచోటా
తప్పదు కత్తులవేట
తప్పూ ఒప్పేదో సంహారం తరువాతా
రణమున భగవత్ గీత
చదివిందీ మన గత చరితా
రక్కసి మూకలతో బ్రతికే హక్కే లేదంట

ఎవరో వస్తారు మనకేదో చేస్తారు
అని వేచే వేదనకూ
జవాబే ఈ జనతా

ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
ఐన అందరి బంధువులు
జయహో జనతా

ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా 

శుక్రవారం, ఏప్రిల్ 21, 2017

అదరక బదులే చెప్పేటి...

అతడు చిత్రం టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అతడు (2005)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : విశ్వ
గానం : విశ్వ

అదరక బదులే చెప్పేటి, తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే, చిరువేకువ జాడతడే
అదరక బదులే చెప్పేటి, తెగువకు తోడతడే

తరతరాల నిశీధి దాటే, చిరువేకువ జాడతడే
అతడే - అతడే - అతడే

ఎవరని ఎదురే నిలిస్తే, తెలిసే బదులే అతడే
ఎవరని ఎదురే నిలిస్తే, తెలిసే బదులే అతడే
పెనుతుఫాను తలొంచి చూసే, పెను నిప్పు కణం అతడే
పెనుతుఫాను తలొంచి చూసే, పెను నిప్పు కణం అతడే

వాహువా వావా వా వ వ్వు వ్వా (కోరస్)
లైఫ్ హాస్ మేడ్ ఇట్ స్ట్రాంగర్
ఇట్ మేడ్ హిం వర్క్ ఏ బిట్ హార్దర్
హి గాట్ టూ థింక్ అండ్ ఆక్ట్ ఏ లిటిల్ వైజర్
దిస్ వరల్డ్ హాస్ మేడ్ హిమ్ యే ఫైటర్


వనువేయ్యి వనయై వనవెయ్యి వనవెయ్యి
వన వన వనన వే వన వయ వెయి వన
వనువేయ్యి వనయై వనవెయ్యి వనవెయ్యి

వన వన వనన వే వన వయ వెయి వన
వనువేయ్యి వనయై వనవెయ్యి వనవెయ్యి

వన వన వనన వే వన వయ వెయి వన
హో హొ హొ హొ..
హో హొ హొ హొ
హో హొ హొ హొ


కాలం నను తరిమిందో, శూలం లా ఎదిరిస్తా
సమయం సరదా పడితే, సమరం లో గెలిచేస్తా
హు యే హొ, హొ యే హొ
నే పెళపెళ ఉరుమై ఉరుముతూ,
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ
పెను నిప్పై నివురును చీల్చుతూ,
జడివానై నే కలబడతా!
హు యే హొ,
పెనుతుఫాను తలవంచి చూసే, హో హొ హొ హొ
తొలినిప్పు కణం అతడే - అతడే - అతడే

డబ డబ దేరిరా డబిన్నం, డబ డబ దేరిరా డబిన్నం,
డబ డబ దేరిరా డబిన్నం, ల ల ల ల ల ల లా..
హిస్ స్మైల్ ఈజ్ ఆల్, ఈజ్ టేకెన్ ఆల్


చుట్టూ చీకటి ఉన్నా, వెలిగే కిరణం అతడు
తెగబడే అల యెదురైతే, తలపడే తీరం అతడు
హొ యే హొ  

పెను తుఫాను తలొంచి చూసే, హొ యే హొ
తొలి నిప్పు కణం అతడే, హొ యే హొ

తన యదలో పగ మేల్కొలుపుతూ,
ఒడిదుడుకుల వల చేధించుతూ,
ప్రతి నిత్యం కదనం జరుపుతూ,
చెలరేగే ఓ శరమతడు

లైఫ్ హాస్ మేడ్ ఇట్ స్ట్రాంగర్
ఇట్ మేడ్ హిం వర్క్ ఏ బిట్ హార్దర్
హి గాట్ టూ థింక్ అండ్ ఆక్ట్ ఏ లిటిల్ వైజర్
దిస్ వరల్డ్ హాస్ మేడ్ హిమ్ యే ఫైటర్


గురువారం, ఏప్రిల్ 20, 2017

చీకటి వెలుగుల...

చీకటి వెలుగులు చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చీకటి వెలుగులు (1975)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దేవులపల్లి
గానం : బాలు, సుశీల

చీకటి వెలుగుల కౌగిటిలో 
చిందే కుంకుమ వన్నెలూ
చీకటి వెలుగుల కౌగిటిలో 
చిందే కుంకుమ వన్నెలూ  
ఏకమైనా హృదయాలలో ఓ ఓ 
ఏకమైనా హృదయాలలో
పాకే బంగరు రంగులు..
 
ఈ మెడ చుట్టూ గులాబీలూ.. 
ఈ సిగపాయల మందారాలూ  
ఈ మెడ చుట్టూ గులాబీలూ.. 
ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ.. 
చిక్కని ఈ అరుణ రాగాలూ 
అందీ అందని సత్యాలా.. 
సుందర మధుర స్వప్నాలా..

తేట నీటి ఈ ఏటి ఒడ్డునా
నాటిన పువ్వుల తోటా
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా
నాటిన పువ్వుల తోటా 
నిండు కడవల నీరు పోసీ
గుండెల వలపులు కుమ్మరించీ 
ప్రతి తీగకు చేయూతనిచ్చీ
ప్రతి మానూ పులకింప చేసీ
 
మనమే పెంచినదీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా 
మనమే పెంచినదీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా

 
మరచి పోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలీ
మరచి పోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలీ

 
ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో 
మల్లెలతో వసంతం.. చేమంతులతో హేమంతం
మల్లెలతో వసంతం.. చేమంతులతో హేమంతం
వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలూ
వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలూ
అన్ని మనకు చుట్టాలేలే..వచ్చీ పోయే అతిధులే

ఈ మెడ చుట్టూ గులాబీలు.. 
ఈ సిగపాయల మందారాలూ 
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ  
ష్.. గల గల మన కూడదూ ఆకులలో గాలీ
జల జల మనరాదూ అలలతో కొండవాగూ
నిదరోయే కొలను నీరూ.. నిదరోయే కొలను నీరూ
కదపకూడదూ ఊ ఊ
ఒదిగుండే పూలతీగా.. ఊపరాదూ

 
కొమ్మపైనిట జంట పూలూ
గూటిలో ఇక రెండు గువ్వలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ
ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలు..
చిక్కని ఈ అరుణ రాగాలూ
 
మరచిపోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలి 

 

బుధవారం, ఏప్రిల్ 19, 2017

బేగంపేట బుల్లమ్మో...

ఈ రోజు శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలోని టైటిల్ సాంగ్ తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శంకర్ దాదా ఎంబిబియస్ (2004)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : మనో

హే... బేగంపేట బుల్లమ్మో...
అరె పంజాగుట్ట పిల్లమ్మో...
హే... బేగంపేట బుల్లమ్మో...
అరె పంజాగుట్టా పిల్లమ్మో
బాడీలోన వేడే చూసి గోలీ వేస్తనమ్మో
హే... చింతల్ బస్తీ చిట్టమ్మో కుకట్ పల్లి కిట్టమ్మో
బాధే నీకు లేకుండానే దూదే రాస్తనమ్మో
హే...హైదర్ గూడా గున్నమో
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
అరె దోమల్ గూడ గుండమ్మో...
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
హై... హైదర్ గూడ గున్నమ్మో...
దోమల్ గూడ గుండమ్మో
వాతంగానీ పైత్యంగానీ చెంతకొస్తే చాలు చిత్తు చిత్తమ్మో
నీ పేరేందబ్బాయా...
దా...దా.దా.దా.దా..దా...
శంకర్ దాదా... శంకర్ దాదా...
శంకర్ దాదాఎం.బి.బి.ఎస్.
హే... శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్..
శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్..
బోలో.....శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్..
శంకర్ దాదా .ఎం.బి.బి.ఎస్......

హే....బేగంపేట బుల్లమ్మో......
అరె పంజాగుట్టా పిల్లమ్మో...ఎహె..ఎహె....

హే.. నడవలేని వాళ్ళు ఉరికేలాగా
నే పెంచుకున్న కుక్క నొదులుతా..హె..హె..
అరె పలకలేని వాళ్ళు అరిచేలాగా
నే రాసుకున్న కవిత చదువుతా..హె..హె..హె..
అరె మోసపోయి వచ్చినోళ్ళ కళ్ళు మిటకరించేలా
మలయాళం ఫిల్ము చూపుతా.. హెయ్..
అరె జంతర్ మంతర్ జాలీ
అరె చూ మంతర కాళీ నీ బతుకుల్లో బాధలెన్నున్నా
చిన్న చిరునవ్వే ఉంది ఓరన్న ...హొయ్....స్

నిన్న హేసరనప్పా
నన్న హేసరా... అహహహ...
శంకర్ దాదా... శంకర్ దాదా ఎం.బి.బి ఎస్.
శంకర్ దాదాఎం.బి.బిఎస్...బోలో...
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...

చేతకానితనము టీబీ అయితే
నే చూపు చూస్తే బాగుపడునులే
లంచగొండి తనము కలరా అయితే
నే చెయ్యి వేస్తే తిరిగిరాదులే....హే...హె...
అన్యాయాలు , అధర్మాలు అక్రమాలు కాన్సరైతే
అంతు తేల్చు ఆన్సరుందిలే...
అరె మోసమున్న బీ.పి. యమ స్వార్ధమన్న షుగరు
ప్రతి జబ్బుకీ వైద్యముందిలే
మరి అన్నిటికీ ఒకే మందులే... హే...

ఏం మందు గురూ...?
ఏం మందా...? అహహహ...
శంకర్ దాదా... శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్..బోలో....
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ కోజై బోలో
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...
ఊ...హ.....ఊ.....హ //11//
అరె శంకర్ దాదా శంకర్ దాదా
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్...


మంగళవారం, ఏప్రిల్ 18, 2017

రామచిలక పెళ్ళికొడుకెవరే...

రామచిలక చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లింక్ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రామచిలక (1978)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : జానకి

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే

ఏరులాంటి వయసు
ఎల్లువైన మనసు
ఎన్నెలంటి వన్నె చూసిఎవరొస్తారో
ఏరులాంటి వయసు
ఎల్లువైన మనసు
ఎన్నెలంటి వన్నె చూసిఎవరొస్తారో
తుళ్ళిపడకే..కన్నె పువ్వా
తుమ్మెదెవరో రాకముందే
ఈడు కోరే తోడుకోసం
గూడు వెతికే కన్నెమొలక

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే

ఊరుదాటే చూపు
చూపు దాటే పిలుపు
ఆరుబైట అందమంతా
ఆరబోసేనే....
ఊరుదాటే చూపు
చూపు దాటే పిలుపు
ఆరుబైట అందమంతా
ఆరబోసేనే..
గోరువంకా..
గోరువంక దారివంక
కోరుకున్న జంట కోసం
ఆశలెన్నో అల్లుకున్న
అంతలోనే ఇంత ఉలుకా

రామచిలక పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మంచి రోజు
మనువాడే పెళ్ళికొడుకెవరే
రామచిలక పెళ్ళికొడుకెవరే
రామచిలక పెళ్ళికొడుకెవరే


సోమవారం, ఏప్రిల్ 17, 2017

దేఖొ దేఖొ గబ్బర్ సింగ్...

గబ్బర్ సింగ్ సినిమాలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గబ్బర్ సింగ్ (2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి
గానం : బాబా సెహగల్, నవీన్ మాధవ్

Ladies and gentlemen,
boys and girls and all the fans
Here comes the Power king
and we call him Gabbar Singh

దేఖొ దేఖొ గబ్బర్ సింగ్ 
ఆల్ ఇండియకి హైపర్ సింగ్
వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్
వీడి బాడీ స్టీల్ కేసింగ్.. వీడి నరం నైలాన్ స్ట్రింగ్
వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్స్ కే కొత్త కలరింగ్
సత్తా కే స్పెల్లింగు లే లే లే
కొట్టాడు సొల్లింగు లే లే లే
కళ్ళల్లో ఫైరింగు లే లే లే
ఏ విలన్‌కైనా డెత్ వార్నింగు
బైబర్తే పుడింగు... ఎలేలేలే
పవర్‌కే బ్రాండింగు... ఎలేలేలే
హై ఎండు స్టైలింగు... ఎలేలేలే
వీడి ఫాలోయింగు మైండు బ్లోయింగు

గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్...
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing
గబ్బర్... గబ్బర్... గబ్బర్...

మన జోలికొస్తే బ్రదరు.. మంటెత్తిపోద్ది వెదరు
మన చేతిదెబ్బ తిని పడుకున్నోళ్లు.. మళ్లీ లెగరు
మంచోణ్ణి గిల్లగలరు.. ఎహే.. చెడ్డోణ్ని గిచ్చగలరు
ఏలెక్కకందని నాలాంటోణ్ణి.. కెలికేదెవరు
మెగ్గావాట్ మొగ్గోడు... ఎలేలేలే
రఫ్ఫోడు టప్ఫోడు... ఎలేలేలే
కూసింత తిక్కోడు... ఎలేలేలే
ఇట్టా పుట్టేశాడు వాట్ టూ డూ

జో డర్ గయా సమ్‌ఝో మర్ గయా

గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing

రెన్‌డెజ్‌వస్ మసాలా మ్యాన్ గబ్బర్
ఇస్‌కో మిలేగీ తో ఖా జావోగీ చక్కర్
బాంగే దేశీ రాక్ జాజ్ కోయీ భాంగ్డా
ఇస్‌కో జైసే నహీ బన్ కోయీ పగ్‌డా
నహీ పాయా కభీ ఐసే జైసా కింగ్
దట్స్ వై దే కాల్ హిమ్ గబ్బర్‌సింగ్

మన ఫేసు పిచ్చ క్లాసు.. మన పంచ్ ఊర మాసు
ఏ డేంజెరైనా సరే ఎదురెళతాయి.. మనలో గట్సు
మన ఒంటిమీద డ్రెస్సు.. నిప్పుకు గాలిలాంటి ప్లస్సు
చెమడాలు ఒలిచి ఉతికారేస్తాది.. గాడ్ ప్రామిస్సు
రయ్యంటూ రైడింగూ... ఎలేలేలే
తుఫానై కుమ్మింగు... ఎలేలేలే
తూటాలా స్ట్రయికింగు... ఎలేలేలే
వీడి పోలీసింగే రూల్సు బ్రేకింగు

జో డర్ గయా సమ్‌ఝో మర్ గయా

గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing

గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
He's On The Way To Do Something
గబ్బర్‌సింగ్ గబ్బర్‌సింగ్
It's Brand New Sound To Sing 


ఆదివారం, ఏప్రిల్ 16, 2017

లాయి లాయి మై హూ జులాయి...

జులాయి సినిమాలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జులాయి (2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : రామజోగయ్యశాస్త్రి
గానం : సుచిత్ సురేశన్, ప్రియ హిమేష్

నానేడ పుడితే నీకేటన్నాయ్...
నానెట్టగుంటే నీకేటన్నాయ్
నానేటిసేత్తే నీకేటన్నాయ్...
సిర్రాకు పెట్టకన్నాయ్
నే దమ్ము కొడితే నీకేటన్నాయ్...
నే డప్పు కొడితే నీకేటన్నాయ్
నే కన్నుకొడితే నీకేటన్నాయ్...
కొట్టానో పళ్లురాల్తాయ్
నా షర్టుకెన్ని బొత్తాలున్నాయ్...
ఒంటికెన్ని టీకాలున్నాయ్
నా జీన్స్‌కెన్ని కన్నాలున్నాయ్...
సెల్ నంబర్‌కెన్ని సున్నాలున్నాయ్
మా నాన్నకెన్ని బాకీలున్నాయ్...
చెల్లికెన్ని రాఖీలున్నాయ్
ఈ తిక్క తిక్క ప్రశ్నలన్ని తొక్కేసెయ్
నేనో పక్క జులాయ్ ఐతే నీకేంటన్నాయ్

ఉల్లాయి లాయి మై హూ జులాయి 
ఉల్లాయి లాయి మై హూ జులాయి
ఉల్లాయి లాయి మై హూ జులాయి
ఉల్లాయి లాయి మై హూ జులాయి

ఏ పోస్టరెనక ఏ బొమ్ముందో...
ఏ ప్లాస్టరెనక ఏ దెబ్బుందో
ఏ బంతి ఎనక ఏ సిక్సరుందో...
కొట్టాకే చూడగలవు
ఏ లేబులెనక ఏ సరుకుందో...
ఏ టేబులెనక ఏ సొరుగుందో
ఎహే ముట్టకుండా చెయ్యెట్టకుండా
నువ్వెట్టా చెప్పగలవు
తెల్లగుంటె జున్ను కాదూ...
నల్లగుంటే మన్ను కాదూ
మెరిసిపోతే గోల్డు కాదూ...
మాసిపోతే ఓల్డు కాదూ
పై లుక్కు చూసి లెక్కలేస్తే తప్పన్నాయ్
నన్ను ఆరా తియ్యడాలు మానెయ్యన్నాయ్

ఉల్లాయి లాయి మై హూ జులాయి 
ఉల్లాయి లాయి మై హూ జులాయి

నా పేరు పిప్పరమెంటు నా ఒళ్లంతా కరెంటు
నా షేపే ట్రంపెట్టు నా చూపే బుల్లెట్ట్టు
అరె... సక్కెరకన్నా స్వీటు
నా లిక్కరుకన్నా ఘాటు
నా ఫేసే ఫ్లడ్‌లైటుఎలిగిస్తా మిడ్‌నైటు
హే... ఊరంతా గందరగోళం
రాత్రైతే రంగుల మేళం
సీకటి సిందుల గజ్జెల తాళం నాలో హైలైటు
ఉల్లాయిలాయి రావో జులాయి...
ఉల్లాయిలాయి సూపిస్తా హాయి...

నీ లెక్కకేమొ నే బే వార్సు...
నా లెక్కలోన నే ఏ క్లాసు
నీ గోల నీది నా గొడవ నాది
మనకెందుకంట క్లాషు
నేనెటెళ్తాంది నాకే తెల్సు
నీ చూపుకేమొ అది టైం పాసు
ఏ లెన్సు పెట్టి నువు చూడగలవు
నా సీరియస్‌నెస్సూ
టెన్తు ఫెయిల్ మరి టెండూల్కర్
క్రికెట్ మాస్టరయిపోలేదా
పేపర్‌బాయ్ టు ప్రెసిడెంటు
అబ్దుల్ కలాము కథ వినలేదా
ఎవడి ఫేటు ఏటవుద్దొ జాంతా నై
అది తేల్చాలంటే నువు సరిపోవన్నాయ్

ఉల్లాయి లాయి మై హూ జులాయి
ఉల్లాయి లాయి మై హూ జులాయి 

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.