ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఆడాళ్ళు మీకు జోహార్లు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు
ఆడాళ్ళూ.... మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళూ... మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళూ.... మీకు జోహార్లు
ఒకరు దబ్బ పండు
ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం
ఒకరిది కానరాని తియ్యదనం
ఒకరు దబ్బ పండు
ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం
ఒకరిది కానరాని తియ్యదనం
ఇద్దరి మంచితనం
నాకు ఇస్తుంది ప్రాణం
ఇది తలచుకుంటే
మతిపోతుంది ఈదినం
ఆడాళ్ళూ.... మీకు జోహార్లు
రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం
రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం
ఆ పనిలో బ్రతుకంతా అరగదీయడం
కన్నీళ్ళే నవ్వుగా మార్చుకోవడం
ఇదే పనా మీకూ... ఇందుకే పుట్టారా
ఆడాళ్ళూ.... మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళూ.... హ హ హ హ...
2 comments:
కే.బి సర్ మీకు జొహార్లు..యెప్పుడూ స్త్రీని శక్తివంతంగా, అర్ధవంతం గా చిత్రీకరించినందుకు..
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.