గురువారం, ఏప్రిల్ 20, 2017

చీకటి వెలుగుల...

చీకటి వెలుగులు చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చీకటి వెలుగులు (1975)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దేవులపల్లి
గానం : బాలు, సుశీల

చీకటి వెలుగుల కౌగిటిలో 
చిందే కుంకుమ వన్నెలూ
చీకటి వెలుగుల కౌగిటిలో 
చిందే కుంకుమ వన్నెలూ  
ఏకమైనా హృదయాలలో ఓ ఓ 
ఏకమైనా హృదయాలలో
పాకే బంగరు రంగులు..
 
ఈ మెడ చుట్టూ గులాబీలూ.. 
ఈ సిగపాయల మందారాలూ  
ఈ మెడ చుట్టూ గులాబీలూ.. 
ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ.. 
చిక్కని ఈ అరుణ రాగాలూ 
అందీ అందని సత్యాలా.. 
సుందర మధుర స్వప్నాలా..

తేట నీటి ఈ ఏటి ఒడ్డునా
నాటిన పువ్వుల తోటా
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా
నాటిన పువ్వుల తోటా 
నిండు కడవల నీరు పోసీ
గుండెల వలపులు కుమ్మరించీ 
ప్రతి తీగకు చేయూతనిచ్చీ
ప్రతి మానూ పులకింప చేసీ
 
మనమే పెంచినదీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా 
మనమే పెంచినదీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా

 
మరచి పోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలీ
మరచి పోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలీ

 
ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో 
మల్లెలతో వసంతం.. చేమంతులతో హేమంతం
మల్లెలతో వసంతం.. చేమంతులతో హేమంతం
వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలూ
వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలూ
అన్ని మనకు చుట్టాలేలే..వచ్చీ పోయే అతిధులే

ఈ మెడ చుట్టూ గులాబీలు.. 
ఈ సిగపాయల మందారాలూ 
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ  
ష్.. గల గల మన కూడదూ ఆకులలో గాలీ
జల జల మనరాదూ అలలతో కొండవాగూ
నిదరోయే కొలను నీరూ.. నిదరోయే కొలను నీరూ
కదపకూడదూ ఊ ఊ
ఒదిగుండే పూలతీగా.. ఊపరాదూ

 
కొమ్మపైనిట జంట పూలూ
గూటిలో ఇక రెండు గువ్వలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ
ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలు..
చిక్కని ఈ అరుణ రాగాలూ
 
మరచిపోకుమా తోటమాలీ
పొరపడి అయినా మతిమాలి 

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.