రామ రామ కృష్ణ కృష్ణ సినిమా టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రామరామకృష్ణకృష్ణ(2010)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : కార్తీక్, రంజిత్, సుధా జీవన్
మావిడిలంక రేవుల్లో పడవెక్కి పావుగంట
గోదారిని దాటి అవతలపక్క ఎద్దులబండిని ఎక్కు హేయ్
గాంధీపురం సెంటర్లోనా దిగిపోగానే అక్కడినుంచి
ప్రెసిడెంట్ గారి ఇంటికి దారి లెఫ్టురైటు వాకబుచేయ్
ఆపక్కన ఏదో గందరగోళం కనిపిస్తుంటే
తొందరగెళ్ళి మందల దూరేయ్ రోయ్
దబదబదబ తన్నులు తింటూ
లబోదిబో మని కేకలు పెట్టే కరోడ శాల్తీ
కాలరు పట్టిన కరెంటు చేతిని చూసి
ఆ చేతిని దాటి చూపును ఇంకొంచెం
ఇంకొంచెం మీదికి తెస్తే కండల అందం
కనిపిస్తుందిరోయ్ ఇంకోంచెం టాప్ కి
టర్నింగ్ ఇచ్చుకున్నావంటే
హూ ఈజ్ దిస్ మాన్..
రామ రామ కృష్ణ కృష్ణ రచ్చమీద రామ కృష్ణ
ఒక సైడు చూడు సాయమొచ్చే రామ రామ రామా
అటు సైడు వీడు మాయ చేసే కృష్ణ కృష్ణ
సంటైమ్స్ సంటైమ్స్ రామ రామ
సంటైమ్స్ సంటైమ్స్ కృష్ణా
సంటైమ్స్ సంటైమ్స్ రామ రామ
సంటైమ్స్ సంటైమ్స్ కృష్ణా
రామ రామ కృష్ణ కృష్ణ రచ్చమీద రామ కృష్ణ
ఎదురుగా పది తలలున్నా ఒక్క దెబ్బకి పడిపోవా
రామ రామ రామరామ
పడుచు అందాలేవైనా ఒక ఈలకే లొంగిపోవా
కృష్ణ కృష్ణ కృష్ణకృష్ణ
నాన్నమాటే కాకుండా అమ్మదీ జవదాటడట
గీతలెన్నో దాటినా గీతార్ధమే మరవడంట
కోతి మూక తో పెద్ద పనులు చక్కబెట్టేస్తాడు ఎక్కడైనా
భూమి పగిలినా బుగ్గమీదే చిరునవ్వే చెదరదెపుడైనా
సంటైమ్స్ సంటైమ్స్ రామ రామ
సంటైమ్స్ సంటైమ్స్ కృష్ణా
సంటైమ్స్ సంటైమ్స్ రామ రామ
సంటైమ్స్ సంటైమ్స్ కృష్ణా
రామ రామ కృష్ణ కృష్ణ రచ్చమీద రామ కృష్ణ
మాటకూడా బాణంలా సూటిగా దిగిపోతాదీ
బుర్రమాత్రం చక్రంలా గిరుగిర్రున తిరుగుతాది
రాజ్యమంతా తనదైనా చెట్లవెంటే నడిచేది
వెన్నలాంటి మనసే వేల మనసులే దోచుకుంది
ఊరి కోసమే భూమి ఉందని చెప్పు మంచితనం
కేరు చేయనని పాము నెత్తిపై చిందులేయు మొండితనం
సంటైమ్స్ సంటైమ్స్ రామ రామ
సంటైమ్స్ సంటైమ్స్ కృష్ణా
సంటైమ్స్ సంటైమ్స్ రామ రామ
సంటైమ్స్ సంటైమ్స్ కృష్ణా
రామ రామ కృష్ణ కృష్ణ రచ్చమీద రామ కృష్ణ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.