శనివారం, ఏప్రిల్ 22, 2017

జయహో జనతా...

జనతాగ్యారేజ్ సినిమాలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జనతాగ్యారేజ్ (2016)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : సుఖ్వీందర్ సింగ్, విజయప్రకాష్

ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
ఐన అందరి బంధువులు
జయహో జనతా

ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు
జగమంతా మనదే పరివారం అంటారు
ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు
పరులకు వెలుగిచ్చే ద్యేయంగా పుట్టారు

ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
ఐన అందరి బంధువులు
జయహో జనతా

ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

హో ఆపదలో నిట్టూర్పు
అది చాల్లే వీరికి పిలుపు
దూసుకు పోతారూ దుర్మార్గం నిలిపేలా
ఎక్కడికక్కడ తీర్పు
వీరందిచే ఓదార్పూ
తోడై ఉంటారూ తోబుట్టిన బందం లా
మనసే చట్టంగా
ప్రతి మనిషికి చుట్టంగా
మేమున్నామంటారూ
కన్నీలలొ నవ్వులు పూయిస్తూ

ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
ఐన అందరి బంధువులు
జయహో జనతా

ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

హుమ్. దర్మం గెలవనిచోటా
తప్పదు కత్తులవేట
తప్పూ ఒప్పేదో సంహారం తరువాతా
రణమున భగవత్ గీత
చదివిందీ మన గత చరితా
రక్కసి మూకలతో బ్రతికే హక్కే లేదంట

ఎవరో వస్తారు మనకేదో చేస్తారు
అని వేచే వేదనకూ
జవాబే ఈ జనతా

ఎవ్వరు ఎవ్వరు వీరెవరు
ఎవరికి వరుసకు ఏమవరు
ఐన అందరి బంధువులు
జయహో జనతా

ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.